.
ఛత్తీస్‌గఢ్‌లో ఇండో టిబెటన్ పోలీసుల మధ్య జరిగిన సంఘర్షణ లో  ఆరుగురు ఐటీబీపీ జవాన్లు చనిపోయారు .. మరో ఇద్దరు గాయపడ్డారు. దారుణమైన   ఈసంఘటన నారాయణ్‌పూర్ జిల్లాలోని కదేనార్ క్యాంపులో సంభవించింది .ఒక చిన్న  గొడవ  విషయమై ఐటీబీపీ కానిస్టేబుల్ కొప్[అం తో తన  తోటి  సహచరులపై కాల్పులకు పాల్పడ్డాడు   సమాచారం. ఆ తర్వాత తానను తాను కూడా కాల్చుకోని ఆత్మహత్యక  చేసుకొని చనిపోయాడని  తెలుస్తోంది.

 

ఐటీబీపీ జవాన్లు చనిపోయిన విషయాన్ని నారాయణ్‌పూర్ ఎస్పీ మోహిత్ గార్గ్ వెల్లడించారు విచక్షణ రహితంగా ఆ జవాన్‌ కాల్పులు జరుపుతుంటే అతని ఆపడానికి వచ్చిన   పలు  జవాన్లకు కూడా ఈ ఘటనలో  తీవ్ర గాయాల పాలు అయ్యారు అని సమాచారం  . గాయపడిన ఇద్దరు జవాన్ల పరిస్థితి కూడా విషమంగా ఉందని ఉందని . ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు  ఇంకా తెలియాల్సి ఉంది.


..
రాయ్‌పూర్‌కు 350 కి.మీ. దూరంలో ఉన్న ఐటీబీపీ క్యాంపులో బుధవారం ఉదయం 9 గంటలకు ఈ ఘటన జరిగిందని.. న్యూస్  ఛానెల్ కి బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ తెలిపారు. ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం.. ఓ జవాన్ తన సర్వీస్ గన్‌తో తన ఇతర  సహచర జవాన్ ల పై కాల్పులకు దిగాడని.. ఈ ఘటనలో ఐదుగురు చనిపోగా.. ఇద్దరికి గాయాలయ్యాయని ఆయన చెప్పారు. ఈ వివాదానికి కారణాలేంటో ఇంకా పూర్తీ గ  తెలియ లేదు అని చెప్పారు .

 

సెలవు మంజూరు చేయకపోవడంతోనే.. సదరు జవాన్ కాల్పులకు దిగాడని అనుమానిస్తున్నామని ఐజీ తెలిపారు. ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించామన్నారు.విచారణ అనంతరం పూర్తీ విషయాలు బయటకు వస్తాయి ప్రజల ప్రాణాలు కాపాడవలసిన జవాన్ లే ఇటువంటి చిన్న కారణాలకు దాడులకు పాల్పడితే ఇక జనని రక్షించింది ఎవరు ..

మరింత సమాచారం తెలుసుకోండి: