దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు రోజురోజుకూ పెరుగుతూ ఆకాశాన్నంటుతున్న విషయం తెలుసిందే.  దేశంలో ఉల్లి దిగుబడి తగ్గిపోవడంతో ఒక్కసారిగా ఉల్లికి డిమాండ్ పెరగడంతో  ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇక భారీగా పెరిగిన ఉల్లి ధరలు సామాన్య ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. అసలు ఉల్లి వైపు  చూడాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. సామాన్య ప్రజలకు ఉల్లిధరలు కోయకుండానే కళ్లనుంచి నీళ్ళు తెప్పిస్తున్నాయి . ఉల్లి  ధరలు భగ్గుమంటున్నడంతో ఉల్లి  వైపు చూడాలంటే సామాన్య ప్రజలు జంకుతున్నారు. దీంతో చాలామంది లబోదిబోమంటునే  ఉల్లి ధరలు పెరిగినప్పటికీ కొనుగోలు చేస్తుంటే. ఇంకొంత మంది తమ రోజువారీ ఆహారంలో ఉల్లి  ఉండే లేకుండానే వంటలు కానిచ్చేస్తున్నారు. 

 

 

 

 కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఉల్లి ధరలు భగ్గుమంటున్నాయి. అయితే ఉల్లి ధరలు భారీగా పెరిగిపోవడంతో సామాన్య ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అన్ని రైతు బజార్లలో కేవలం 25 రూపాయలకు ఉల్లిని  విక్రయించేందుకు నిర్ణయించారు. దీనికోసం కడప నుంచి ఉల్లిని దిగుమతి చేసుకొని ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నారు. అయితే ఉల్లి ధర రోజురోజుకు పెరుగుతూనే ఉంది. కర్నూల్ మార్కెట్లో ఉల్లి ధర తారాస్థాయికి చేరుకుంది. కర్నూలు మార్కెట్ లో ఉల్లి ధర  రికార్డు సృష్టించింది . నేడు క్వింటాలు ఉల్లి ధర 12,510 రూపాయల వరకు పలికింది.కాగా  ఏడాదిలో ఇదే అత్యధిక ధర అని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. 

 

 

 

 గత కొద్దీ  రోజురోజుకు ఉల్లి ధరలు భారీగా పెరుగుతుండడంతో ఉల్లిని కొనలేని స్థితిలో సామాన్య ప్రజలు అల్లాడుతున్నారు. అయితే రాష్ట్రంలో భారీగా ఉల్లి ధరలు పెరిగినప్పటికీ జగన్ సర్కారు మాత్రం ఉల్లిని  కర్నూలు నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకొని రాష్ట్రంలోని అన్ని రైతు బజార్లలో ప్రజలకు కేవలం ఇరవై ఐదు రూపాయలకే సబ్సిడీపై ఉల్లిని  అందజేస్తుంది జగన్ సర్కార్.  అయితే ఒక్క వినియోగదారునికి ఒక కిలో ఉల్లి మాత్రమే అందజేస్తున్నారు. ఉల్లి దిగుబడి పెరిగిన తర్వాత ఈ లిమిట్ ను   పెంచుతామని అధికారులు తెలిపారు. దీంతో చాలామంది రైతు బజార్లలో ఉల్లిని  కొనుగోలు చేసేందుకు క్యూ కడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: