ఆంధ్రప్రదేశ్ లో వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత అన్ని విషయాల్లో కూడా ప్రభుత్వం దూకుడును ప్రదర్శిస్తోంది.  ఇచ్చిన హామీలను అమలు చేయడంలో  ప్రభుత్వం ముందు వరసలో ఉంటోంది.  ప్రతి విషయంలో ముందుండే రాష్ట్రం మరో విషయంలో కూడా అందరికంటే ముందు ఉండటం విశేషం.  వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ వస్తున్నది.  


ఇలా ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ వస్తున్న వైకాపా, దానికి కావాల్సిన డబ్బులను కూడా సర్దుబాటు చేస్తూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం తక్కువ ఉన్నది.   రెవిన్యూ కొన్ని ఇతర శాఖల నుంచి మాత్రమే ప్రభుత్వానికి ఆదాయం అందుతున్నది.  దీంతో ప్రభుత్వం అప్పులు చేయాల్సి వస్తున్నది.  రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ నెలలో 29 రోజుల్లో పదిసార్లు ఋణం తీసుకున్నది.  


ఆర్బీఐ ప్రతి వారం మార్కెట్ బారోయిరగ్స్ ద్వారా వేలం నిర్వహిస్తుంది.  ఈ వేలంలో రాష్ట్రాలు తమ సెక్యూరిటీ బాండ్ లను తనఖాగా పెట్టి రుణాలు తీసుకోవచ్చు.  అయితే, వీటిని నిర్ధిష్ట కాలపరిమితో తిరిగి కట్టెయ్యాలి.  స్పష్టంగా చెప్పాలి అంటే బ్యాంకుల నుంచి మనం తీసుకునే పర్సనల్ లోన్ లాంటిది.  ఇలాంటి రుణాలను ఆర్బీఐ రాష్ట్రప్రభుత్వాలు కల్పిస్తోంది.   నవంబర్ 1 వ తేదీన వేలంలో రాష్ట్రం తొమ్మిది సంవత్సరాల తిరిగి చెల్లింపు గడువుతో వెయ్యికోట్లు,  అలానే 12 సంవత్సరాల తిరిగి చెల్లింపు ప

రిమితితో మరో వెయ్యి కోట్లు రుణాలు తీసుకుంది.  
ప్రతి వారం ఈ వేలం ఉంటుంది.  దీంతో నవంబర్ 7 వ తేదీన జరిగిన వేలంలో 10, 12 సంవత్సరాల కాల పరిమితితో రెండు వేలకోట్ల రూపాయలు తీసుకుంది.  అదే విధంగా నవంబర్ 15 వ తేదీన జరిగిన వేలంలో 11,12 సంవత్సరాల తిరిగి చెల్లింపు హామీతో రెండువేలకోట్లు, అదే విధంగా నవంబర్ 22 వ తేదీన మరో రెండువేలకోట్లు తీసుకుంది.  ఈనెల 29 వ తేదీన జరిగిన వేలం ద్వారా పదేళ్ల కాలపరిమితితో మరో రూ.533 కోట్ల ఋణం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఒకేనెలలో ఈ స్థాయిలో రుణాలు తీసుకోవడంతో ప్రభుత్వం అప్పుడు భారీగా పెరిగిపోతున్నది. మార్కెట్ బారోయిరగ్స్ ద్వారా ఇప్పటి వరకు మొత్తం రూ. 33,617 కోట్లు తీసుకుంది.  గరిష్టంగా రూ.40వేల కోట్ల వరకు తీసుకోవచ్చు.  ప్రభుత్వం ఇంకా ఏడువేల కోట్ల రూపాయల వరకు తీసుకునే ఛాన్స్ ఉన్నది.  అయితే, అప్పులు పెరిగిపోతుండటంతో ప్రభుత్వం ఆదాయ మార్గాలను అన్వేషిస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: