దేశంలో ప్రస్తుతం ఎక్కడ చూసినా మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతూనే ఉన్నాయి.  ఎంతగా కంట్రోల్ చేసినా ఏ మాత్రం తగ్గడం లేదు.  తగ్గకపోగా ఎక్కువవుతున్నాయి.  నిర్భయ వంటి కేసులను అనేకం జరుగుతూనే ఉన్నాయి.  కఠినమైన చట్టాలు తీసుకొచ్చినా ఆగడం లేదు. ఎంతమంది నిందితులను పట్టుకొని జైల్లో పెట్టినా ఈ హత్యలు, అత్యాచారాలు ఆగడం లేదు.  


ఇక ఇదిలా ఉంటె, ఆడపిల్లల కోసం దేశంలో అనేక రాష్ట్రాలు అనేక పధకాలు తీసుకొస్తున్నారు.  ఆ పధకాల కింద డబ్బును కేటాయిస్తున్నారు.  కాగా, కేంద్రం కూడా ఆడపిల్లల కోసం అనేక పధకాలు ప్రకటించింది.  ఇప్పటికే మహిళల కోసం సుకన్య సమృద్ధి యోజన అనే ఓ పధకం ఉన్నది.  ఈ పధకం ద్వారా కొంత డబ్బును ఆడపిల్లల కోసం జమ చేయాల్సి ఉంటుంది.  ఈ పధకంలో మనమే ప్రతి నెల కొంత ఆడపిల్లల పేర డబ్బు జమ చేయాల్సి ఉంటుంది.  


అటు ప్రభుత్వం కూడా కొంతవరకు ప్రోత్సాహం అందిస్తుంది.  అయితే, ఇప్పుడు తీసుకొచ్చిన బాలిక సమృద్ధి యోజన పధకంలో మనం డబ్బులు జమ చేయాల్సిన అవసరం లేదు.  కేంద్ర ప్రభుత్వమే డబ్బును డిపాజిట్ చేస్తుంది.  ఈ పధకం కింద ఇంట్లో ముగ్గురు ఆడపిల్లల వరకు వర్తింపజేసుకోవచ్చు.  ఇంట్లో ఆడపిల్ల పుట్టగానే అమ్మాయికి తల్లికి కేంద్రం రూ. 500 రూపాయలు క్యాష్ ఇస్తుంది.  ఆ తరువాత  అమ్మాయికి ఒకటో తరగతి నుంచి మూడో తరగతి వరకు సంవత్సరానికి మూడు వందలు, నాలుగో తరగతిలో ఉండగా రూ. 500, ఐదో తరగతిలో ఉండగా రూ.600, ఆరు, ఏడు తరగతుల్లో ఉండగా 700, ఎనిమిదో తరగతిలో ఉండగా 800, తొమ్మిదో తరగతిలో ఉండగా 900, పదోతరగతిలో ఉండగా వెయ్యి రూపాయలు అమ్మాయి అకౌంట్ లో డిపాజిట్ అవుతుంది.  


ఇలా బాలిక సమృద్ధి యోజన పధకం ద్వారా బాలిక అకౌంట్ లో డిపాజిట్ అయిన డబ్బును 18 ఏళ్ల తరువాత 50శాతం, 21 ఏళ్ళు నిండిన తరువాత మిగతా 50% తీసుకోవచ్చు.  ఈ పధకం ద్వారా కొన్ని లక్షల మంది చిన్నారులకు లబ్ది చేకూరుతుంది.  చిన్నారుల కనీస అవసరాలతో పాటుగా వారి పై చదువులకు కూడా కొంతవరకు ఈ మొత్తం ఉపయోగపడుతుంది. ఈ పధకానికి సంబంధించిన అప్లికేషన్లు అంగన్ వాడి టీచర్ల వద్ద అందుబాటులో ఉంటాయట.  

మరింత సమాచారం తెలుసుకోండి: