కత్తికి రెండు వైపులా పదును ఉంటుంది.  దానిని ఎలా వాడుతున్నాము అనే దాన్ని బట్టే వినియోగం ఉంటుంది.  కూరగాయలు కొస్తే కడుపు నిండుతుంది... అదే కడుపులో పొడిస్తే.. కటకటాల పాలు చేస్తుంది.  ఎందులోనైనా సరే మంచి చెడు అనే విషయాలు రెండు ఉంటాయి.  మనం తీసుకునే నిర్ణయం, అనుసరించే విధానంపైనే ఆధారపడి ఉంటుంది.  టెక్నాలజీ అభివృద్ధి చెందిన తరువాత ప్రపంచంలో అన్నింటికంటే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అత్యంత ఇష్టపడే వస్తువు సెల్ ఫోన్.  


తీగలుండే ల్యాండ్ ఫోన్ నుంచి జేబులో ఇమిడిపోయే సెల్ ఫోన్ ఆవిష్కృతమైంది.  పుట్టిన ప్రతి చిన్న పిల్లాడి నుంచి సెల్ ఫోన్ లేకుండా ఉండలేకపోతున్నారు.  సెల్ ఫోన్ లేకుంటే అన్నం తినను అని మారం చేసే వ్యక్తులు ఉన్నారు. ఆటలు, పాటలు అన్ని ఇప్పుడు సెల్ ఫోన్ లోనే.  అందుకే పిల్లలు సెల్ ఫోన్ కు అడిక్ట్ అవుతున్నారు.  సెల్ ఫోన్ తీసుకోండి.  వాడుకోండి. 


అయితే, తల్లి దండ్రులు పిల్లలకు దానిపై నియంత్రణ కలిగి ఉండేలా చర్యలు తీసుకోవాలి.  నియంత్రణ చాలా అవసరం.  ముఖ్యంగా స్కూల్ కు వెళ్లే ఆడపిల్లలకు సెల్ ఫోన్ తప్పనిసరిగా ఉండాలి.  సెల్ ఫోన్ వారి దగ్గర ఉండటం వలన ఎన్నోచాల ఉపయోగం ఉంటుంది.  ముఖ్యంగా సేఫ్టీ.  సెల్ ఫోన్ లలో గూగుల్ మ్యాప్స్ ఎలా ఉపయోగించాలి.. గూగుల్ మ్యాప్ లో మన లొకేషన్స్ ఎలా షేర్ చేయాలి... 


ఎక్కడైనా మనం ఆగిపోతే, ఇబ్బందులు పడితే..  అక్కడి లోనేషన్ సెకన్లలో ఎలా షేర్ చేయాలి.  ఎవరెవరికి షేర్ చేయాలి అనే విషయాలు అమ్మాయిలు తప్పకుండా తెలుసుకొని ఉండాలి.  అంతేకాదు, పిల్లలకు ఇచ్చే మొబైల్ ఫోన్స్ లో ట్రాకింగ్ సిస్టమ్ తప్పనిసరిగా ఉండాలి.  ట్రాకింగ్ సిస్టం ను ఏర్పాటు చేయడం వలన పిల్లలు ఎక్కడ ఉన్నారో తెలుసుకునే వీలు ఉంటుంది.  ఒకేవేళ ఆలస్యమైనా, ఏదైనా ప్రమాదంలో ఉన్నా వెంటనే పోలీసులను అలర్ట్ చేసేందుకు వీలవుతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: