తెలంగాణ రాష్ట్రము ఏర్పాటు జరిగిన తరువాత సీఎం కెసిఆర్ చేప్పట్టిన పెద్ద ప్రాజెక్టులలో యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమాన్ని చేప్పట్టిన విషయం మనకందరికీ తెలిసినదే అయితే దేవాలయ పునర్నిర్మాణం లో చేప్పట్టిన పనులు అందరి మెప్పు పొందిన కొన్ని కార్యక్రమాలు పనులు మాత్రం కెసిఆర్ ప్రతిష్టకు భంగం కలిగేలా ఏర్పడినవి.

ఇందులో కొన్ని దేవాలయ గోపురాలపైనా శిలలపైనా కెసిఆర్ మరియు తెరాస పార్టీ గుర్తులను పార్టీకి సంబందించిన ఆనవాళ్లను  చిహ్నాలుగా  చెక్కడం ఇవన్నీ పెద్ద దుమారాన్ని కలిగించాయి. ప్రతిపక్ష నాయకులూ అందరు నిరసనలు చేపట్టి అన్యాయాన్ని రాష్ట్రము అంత ప్రచారం చేసింది. దీని విషయం లో  దిగివచ్చిన అధికార వర్గం రెండు రోజులలో ఆ శిలలను వాటిపైన ఉన్న తెరాస, కెసిఆర్ బొమ్మలను తీసేసి దేవుళ్ళ బొమ్మలను ఏర్పాటు చేసారు. ఈ పని చేసిన తెరాస పార్టీ సభ్యులను మరియు దేవాలయ అధికారులను ప్రజలు తిట్టుకున్నారు అప్పట్లో అది పెద్ద సంచలనమే... అయితే గత కొన్నిరోజుల క్రితం కొన్ని వందల  సంవత్సరాల క్రితం నిర్మించిన గాలి గోపురాన్ని కూలగొట్టేయడం మరియు మూల విరాట్‌లో మార్పులు చేయడంపై  రాష్ట్ర ప్రజలు మరియు బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

అలాగే దేవాలయ పునర్నిర్మాణం లో ఎన్నో అవకతవకలు జరుగుతున్నాయని, దేవాలయ ప్రతిష్టకు భంగం కలుగుతుందని వాపోయారు. అలాగే లక్ష్మి నర్సింహస్వామి యాదాద్రి లో శాంతి స్వరూపుడని అయన తల పైన ఏడు పడగల నాగేశ్వరుడు ఉంటాడని దీన్ని తెరాస మరియు కెసిఆర్ లు నాలుకను బయటకు తీసినట్లు మరియు కొమ్ములతో కూడిన ఉగ్రరూపంగా మార్చారని  శాంతి స్వరూపుడైన నరసింహస్వామి ని ఉగ్రరూపంగా మార్చడాన్ని తట్టుకోలేని వారు కెసిఆర్ పైన  మండిపడ్డారు.  బీజేపీ నేతలు  ఈ విషయమై మీడియాతో మాట్లాడుతూ నరసింహస్వామి తలపై కేసీఆర్ కుటుంబ సభ్యుల తలల్ని పెడతారేమో అంటూ మండిపడ్డారు. స్వామి విగ్రహానికి కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్, సంతోష్‌ల తలలు తగిలిస్తారా అని నిలదీశారు. ఆలయ ప్రతిష్టను మంట గలుపుతారా అంటూ ధ్వజమెత్తారు. కేసీఆర్ చర్యలు రాష్ట్రానికి అరిష్టమని బీజేపీ నేతలు పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: