ప్రేమ, ప్రతీకారం, ఆవేశం మనిషిని మృగంగా మారుస్తున్నాయి.  ప్రేమ పేరుతో వేధించడం, వంచించడం.. ఏడిపించడం పెళ్లి పేరుతో మోసం చేసి వలలో వేసుకొని కోరిక తీరగానే కామ్ గా అక్కడి నుంచి తప్పించుకుపోవడం ఇదే పరిపాటిగా మారింది.  చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరిని ఇలానే ఏడిపిస్తున్నారు.  అమ్మాయి అయితే చాలు ఇలా చేసి ఏడిపిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.  

 


ఇక ఇదిలా ఉంటె, మధ్యప్రదేశ్ లోని జబల్పూర్ జైల్లోని కుద్వారా గ్రామంలో శివకుమార్ అనే 24 ఏళ్ల యువకుడు ప్రేమ పేరులో ఓ మైనర్ బాలికను హింసించడం మొదలుపెట్టాడు.  వెంటపడి వేధిస్తుండటంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.  దీంతో పోలీసులు శివకుమార్ ను అరెస్ట్ చేశారు.  కొన్ని రోజులపాటు జైల్లో ఉన్నాడు శివకుమార్.  


ఆ సమయంలోనే శివకుమార్ ఆమెపై పగ పంచుకున్నాడు.  పగను పెంచుకొని ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని అనుకున్నాడు.  జైలు నుంచి వచ్చిన తరువాత కూడా ఆ మైనర్ బాలికను అలా వేధిస్తూనే ఉన్నాడు.  ఓ రోజు సరాసరి ఆ యువతి ఇంటికి వచ్చాడు.  అయితే, అప్పటికే ఆ యువతి తల్లిదండ్రులు బయటకు వెళ్లారు.  అదే అదునుగా భావించిన శివకుమార్  ఒళ్ళు మరిచిపోయి వెంట తెచ్చుకున్న కత్తితో విచక్షణా రహితంగా పొడిచాడు.  


బాలిక తన అన్ను అప్రమత్తం చేయడంతో చుట్టూ పక్కల వాళ్ళు వచ్చి తలుపు బద్దలు కొట్టే సరికి ఘోరం జరిగిపోయింది.  ఆ యువతిని విచక్షణ రహితంగా పొడుస్తుండటంతో గ్రామస్తులు శివకుమార్ ను పట్టుకొని చితక్కొట్టుడు కొట్టి పోలీసులకు అప్పగించారు.  హుటాహుటిన ఆ 16 ఏళ్ల యువతిని హాస్పిటల్ కు తీసుకెళ్లగా అప్పటికే ఆమె మరణించిందని వైద్యులు చెప్పారు.  అయితే, ఆ యువతి శరీరంలో 30కత్తిపోట్లు ఉన్నట్టుగా వైద్యులు చెప్పడంతో పోలీసులు షాక్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: