భారత నావికాదళం ప్రతి సంవత్సరం డిసెంబర్ 4వ తేదీన ఇండియన్ నేవీ డేగా జరుపుకుంటోంది. నేవీ డే సందర్భంగా వైజాగ్ లో నేవీ విభాగం అబ్బురపరిచే విన్యాసాలు చేసింది. నేవీ డే విశాఖపట్టణంలో ఘనంగా జరిగింది. ఏపీ సీఎం జగన్ ముఖ్య అతిథిగా ఈ వేడుకకు హాజరయ్యారు. సీఎం జగన్ మాట్లాడుతూ నేవీ సిబ్బందికి నేవీ డే శుభాకాంక్షలు తెలిపారు. 
 
నేవీ సిబ్బంది సేవలు విపత్తుల సమయంలో, తీర రక్షణ సమయంలో అమోఘమని సీఎం చెప్పారు. తూర్పు నావికాదళాధిపతి అతుల్ కుమార్ జైన్ సీఎం జగన్ తో పాటు నావికాదళ విన్యాసాలను చూశారు. వేలాది మంది నావికాదళ విన్యాసాలను చూడటానికి వచ్చారు. వైజాగ్ బీచ్ రోడ్ వేలాది మందితో కిటకిటలాడింది. అతుల్ కుమార్ జైన్ మొదట సాగర తీరాన అమరవీరులకు నివాళులర్పించారు. 
 
అమర వీరుల త్యాగాలను స్మరించుకుంటూ విక్టర్ ఎట్ సీ వద్ద నౌకాదళ సిబ్బంది గౌరవ వందనం చేశారు. తూర్పు నావికా దళం 1971 సంవత్సరంలో పాకిస్తాన్ పై యుద్ధంలో గెలుపు సాధించడంలో ముఖ్య పాత్ర పోషించింది. విశాఖ ఆర్‌కే బీచ్‌లో తూర్పు నావికా దళం ప్రారంభమై 50 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా నేవీ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. సీఎం జగన్ నేవీ విన్యాసాలను చూస్తూ నేవీ సిబ్బందిని అభినందించారు. 
 
సీఎం జగన్ నేవీ విన్యాసాల అనంతరం సర్క్యూట్ హౌస్ కు చేరుకొని నేవీ హౌస్ కు బయలుదేరుతారు. నేవీ హౌస్ లో జరిగే ఎట్ హోం కార్యక్రమంలో 6.20 గంటల నుండి 7 గంటల వరకు పాల్గొంటారు. ఆ తరువాత నేవీ హౌస్ నుండి విశాఖ ఎయిర్ పోర్టుకు బయలుదేరి రాత్రి 8.10 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టు చేరుకుంటారు. రాత్రి 8.40 గంటలకు సీఎం జగన్ తన ఇంటికి చేరుకుంటారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: