మనిషిలో ఉన్న ఆశ మనిషి అవసరాన్ని తీరుస్తుందేమో గాని అతని పతనానికి నాంది కూడా పలుకుతుంది. ఇకపోతే పేదరికం అనేది చాలా భయంకరమైంది. ఎందుకంటే పేదరికంలో ఉన్నామని మనుషులకు తెలుస్తుంది కాని శరీరానికి కాదు. దానికి ఆకలేసిన సమయానికి ఆహారం అందించాలి లేదంటే లోపల పేగులను మెలిపెట్టి చంపుతుంది. ఈ ఆకలినే ఆసరాగా తీసుకుని కొందరు మనుషులు అనే గద్దలు సమాజంలో దొంగలను, వ్యభిచారులను తయారు చేస్తున్నారు. ఇదిగో అదే జరిగింది.

 

 

పాకిస్థాన్ లో ఉన్న పేదరికాన్ని ఆసరాగా తీసుకుని పెళ్లి పేరుతో  మహిళలను అక్రమంగా చైనాకు తరలించి, వారిని బలవంతం గా వ్యభిచారం కూపంలోకి నెట్టేస్తున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఇలా పెళ్లి పేరుతో మొత్తం 629 మంది మహిళలను వివిధ ప్రాంతాల నుండి తీసుకుని చైనా ముఠాలకు అమ్మేసినట్టు పాకిస్థాన్ అధికారుల దర్యాప్తు నివేదిక అసోసియేటెడ్ ప్రెస్‌కు చిక్కింది. ఈ నివేదిక ప్రకారం.. 2018 నుంచి జరుగుతున్న అక్రమరవాణాలో చిక్కుకున్న బాధితుల సంఖ్యను చూస్తే ఇంకా ఎక్కువే అవుతుందంటున్నారు.. అయితే, చైనాతో ఉన్న సత్సంబంధాలు దృష్యా పాక్ ఉన్నతాధికారులు వారిపై ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం.

 

 

ఇదిలా ఉండగా, మహిళ అక్రమ రవాణాలో నిందితులుగా ఉన్న మొత్తం 31 మంది చైనా పౌరులను అక్టోబరులో ఫైసలాబాద్ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. ఇకపోతే  ఈ వ్యవహారంపై పాకిస్థాన్ పాలకులు నోరు మెదపడంలేదు. కొంత మంది ఉన్నతాధికారులు ఉద్దేశపూర్వకంగానే దర్యాప్తు జాప్యం చేస్తున్నారంటున్నారు సామాజిక వేత్తలు.. ఇదిలా ఉండగా మరోవైపు, చైనా విదేశాంగ శాఖ తమకు ఈ విషయం  తెలియని సన్నాయి నొక్కులు నొక్కుతోంది. ఇకపోతే పాకిస్థాన్‌లోని క్రిస్టయన్ మైనార్టీ యువతులను చైనా ముఠాలు టార్గెట్ చేసినట్టు అసోసియేట్ ప్రెస్ విచారణలో తేలింది.

 

 

ఇదే కాకుండా వివాహం పేరుతో పేదపిల్లల తల్లిదండ్రులకు డబ్బులు ఆశచూపి వారిని తమ వెంట చైనాకు తీసుకెళ్తారు. అక్కడ వారిని బలవంతంగా వ్యభిచారంలోకి దింపుతున్నారు. పాక్‌లోని పేద వర్గాలకు చెందిన వారిలో క్రిస్టియన్లు ఒకరు కావడంతో వారినే టార్గెట్ చేస్తున్నారు. చైనాకు చెందిన పెళ్లి కొడుకుల నుంచి 25,000 నుంచి 65,000 డాలర్లు అంటే రూ.40 లక్షల నుంచి రూ.కోటి వరకూ మధ్యవర్తులు వసూలు చేసి, యువతుల తల్లిదండ్రులకు కేవలం రూ.2 లక్షలు మాత్రమే చెల్లించి ఈ దురాగతాలు సాగిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: