సూడాన్ దేశంలోని పింగాణీ పరిశ్రమలో ఎల్పీజీ ట్యాంకర్ పేలుడు సంభవించింది. ఎల్పీజీ ట్యాంకర్ పేలడంతో ఈ ప్రమాదంలో 23 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో 18 మంది భారతీయులు మరణించారని అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 130 మంది ఈ ప్రమాదంలో గాయపడ్డారు. భారత రాయబార కార్యాలయం 50 మంది భారతీయులు పింగాణీ పరిశ్రమలో పని చేస్తున్నట్లు తెలిపింది. 
 
పూర్తి స్థాయిలో సహాయక సామాగ్రి లేవని, ఫ్యాక్టరీలో సరైన భద్రతా ప్రమాణాలు లేవని తెలుస్తోంది. ఈ ఘటనపై విచారణ జరుగుతోంది. స్థానిక అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేయటానికి ప్రయత్నాలు చేశారు. స్థానికులు ప్రమాదంలో గాయపడ్డవారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి తీవ్ర విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 
 
సూడాన్ దేశ వ్యాప్తంగా ఎల్పీజీ ట్యాంకర్ పేలుడు ఘటన సంచలనంగా మారింది. ప్రమాదంలో చనిపోయిన 18 మంది భారతీయులు ఏ రాష్ట్రానికి చెందిన వారో ఇంకా తెలియాల్సి ఉంది. సూడాన్ రాజధాని ఖర్తూన్ లో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటన తరువాత 16 మంది గల్లంతయినట్లు తెలుస్తోంది. గల్లంతయిన వారిలో కొందరు చనిపోయి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. 
 
ఎంబసీ ఒక ప్రకటనలో మృతదేహాలు పూర్తిగా కాలిపోవటంతో మృతదేహాలను గుర్తించలేకపోతున్నట్లు తెలిపింది. రాయబార కార్యాలయం ఈ ఘటన తరువాత ఈ ఫ్యాక్టరీలో పని చేస్తున్న భారతీయుల వివరాలను ప్రకటించింది. ప్రాథమిక దర్యాప్తులో ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదాలను నివారించేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవటంతో మృతుల సంఖ్య పెరిగినట్లు తెలుస్తోంది. ఏడుగురు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదం నుండి బయటపడిన భారతీయులను దగ్గరలోని మరో సిరామిక్ ఫ్యాక్టరీకి తరలించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: