తెలంగాణలో ఎన్నో రోజులు జరిగిన ఆర్టీసి సమ్మె వల్ల నష్టపోయిన ప్రయాణికులు. ఆర్టీసీ సమ్మె ముగిసిన తరువాత చార్జీలు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించిన తర్వాత ప్రయాణికులు మళ్లీ తమ జేబుకి చిల్లు పెట్టుకోవాల్సిన అవసరం వచ్చింది. గతంలో లాగా కాకుండా సారా సగటున ప్రతి కిలోమీటర్ కు 20 పైసల చొప్పున ప్రతి బస్సు సర్వీసుకు పెంచింది తెలంగాణ ప్రభుత్వం. దీనికి కారణం ఆర్టీసీకి వచ్చే నష్టాలను నివారించడానికి అని కారణం చెప్పింది.

 

ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణ ఆర్టీసీ లో చార్జీలు పెంచిన తరువాత ఎప్పుడెప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ లో కూడా ఛార్జీలు పెరుగుతాయని భయపడుతున్నారు ప్రయాణికులు .ఇది, ఇలా ఉండగా కేంద్ర ప్రభుత్వం కూడా షాక్ ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. 

 


కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న రైల్వే శాఖ కూడా తమ ప్రయాణ ఛార్జీలు అతి త్వరలో 5 నుంచి 10 శాతం దాకా పెంచే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం అందింది. ఈ మేరకు ప్రభుత్వం కి రైల్వే నుంచి ఒక నివేదిక అందిందట. ప్రధాని మోదీ దీని కోసం ఆమోద ముద్ర వేసినట్లు కూడా తెలుస్తుంది. కానీ ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తరువాతనే ఈ పెంపు ప్రతిపాదన బయటికి వచ్చే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తోంది.

 

నరేంద్ర మోడీ ప్రధాన మంత్రి అయిన తర్వాత రైల్వే ఛార్జీలు పెంచడం ఇది రెండోసారి అవుతుంది. ఇంతకుముందు 2014లో రైల్వే ఛార్జీలను దాదాపు 15 శాతం పెంచారు. రైల్వేకు అన్నీ ఖర్చులు కూడా పెరగడంతో నిర్వహణ భారంగా మారి ప్రయాణికుల నుంచి వచ్చిన డబ్బుతో ఆ లోటుని బూడ్చుకోవాలి అని చూస్తుంది. ప్రయాణికులతో పాటు సరుకు రవాణా చార్జీలు కూడా పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీని వల్ల సిమెంట్, ఇనుము ధరలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది

మరింత సమాచారం తెలుసుకోండి: