ఈ మద్య సోషల్ మీడియా వచ్చినప్పటి ముఖ్యంగా టిక్ టాక్ లాంటి యాప్ లు వచ్చిప్పటి నుంచి చాలా మంది తమ వింత చేష్టలతో అందరి దృష్టి ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు.  ముఖ్యంగా యూట్యూబ్ లో తమకు నచ్చిన పనులు చేస్తూ అవి సోషల్ మీడియాలో అప్ డేట్ చేస్తూ లైకుల కోసం తెగ తాపత్రయ పడుతున్నారు.  అయితే సోషల్ మీడియాలో ఇలాంటి మాత్రమే కాదు... కొంత మంది సాహస కృత్యాలు, సమాజానికి మంచి చేసే పనులు కూడా పోస్ట్ చేస్తున్నారు.  చాలా మంది మాత్రం టిక్ టాక్ లాంటి వాటితో వినోదానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే ఇలాంటి టిక్ టాక్ లో పిచ్చి సాహసాలు చేసి ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు.  ఇక సెల్పీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. పనికిమాలిన సెల్ఫీల కోసం ప్రాణల మీదకు తెచ్చుకున్న సంఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి.  

 

సాధారణంగా భార్య భర్తల మద్య అల్లరి, గిల్లి కజ్జాలు ఉండటం సహజం.. అయితే ఈ మద్య తమ మద్య అల్లరిని వీడియోలు తీసుకుంటూ సోషల్ మీడియాలో పోస్టు చేస్తే ఆనందించే వారు చాలా మంది తయారయ్యారు.  తాజాగా తన భార్యని అల్లరి పెడుతూ ఆమెతో తిట్లు తిన్నాడు ఓ భర్త. ఇంతకీ ఆయన గారు చేసిన ఘనకార్యం ఏంటేంటే.. ఆమె మంచి నిద్రలో ఉండగా.. పచ్చి గుడ్డును పగలగొట్టి నోటిలో వేశాడు. దీంతో ఆమె షాకైంది. నిద్ర నుంచి లేస్తూనే అతడిపై ఆగ్రహంతో దాడి చేయడానికి ప్రయత్నించింది.  ఆవేశంతో వస్తున్న ఆమెను ఆపడానికి మనో ప్లాన్ వేశాడు. తలుపులకు ప్లాస్టర్ అతికించాడు. 

 

 రష్యాలోని సమరా నగరంలో నివసిస్తున్న తత్యానా సబిస్క్యా (30) ఓ రోజు మంచి నిద్రలో ఉంది. ఎప్పటి నుంచో ఇలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్న ఆమె భర్త స్బిట్స్కే గెన్నాడీ (35)గుడ్డు పగలగొట్టి.. పచ్చ సొనను స్పూన్‌లో వేసుకుని ఆమె బెడ్ వద్దకు వెళ్లాడు. అనంతరం గుడ్డు సొనను ఆమె నోటిలో వేశాడు.  దాంతో ఆమె ఒక్కసారే షాక్ తిని వెంటనే లేచింది. కోపంతో భర్తను కొట్టేందుకు ఆమె మంచం మీద నుంచి పరుగెత్తుకొచ్చింది.  

 

అప్పటికే మనోడు గుమ్మానికి అడ్డంగా టేపులు అంటించాడు. దీంతో ఆమె ముఖం ఆ టేపులకు అంటుకుంది. అది విడిపించుకోవడానికి  నానా తంటాలు పడింది. ఇదంతా ఆమె భర్త బాగా ఎంజాయ్ చేసినట్లు కనిపించింది. రష్యాలోని సమరా నగరంలోని భార్యభర్తల మద్య జరిగిన ఈ ఫన్నీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: