ఆర్థిక మందగమనం కారణంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇవ్వాల్సిన జిఎస్టి పరిహారం వారు సరిగ్గా ఇవ్వడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. ఏ విషయంపై దేశంలో బిజెపి కాకుండా వేరే పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల ఆర్థిక శాఖ మంత్రులు చాలా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. జిఎస్టిలో రాష్ట్రాలకు పరిహారం కింద చెల్లించాల్సి నిధులు చాలా ఆలస్యం అవుతున్నందుకు ఇది కారణమని తెలుస్తోంది.

 

ఆయా రాష్ట్రాల్లో తమకు రావాల్సిన బకాయిలను త్వరగా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి. మేము ప్రతి సారి ఇలా ఢిల్లీకి రావడం తమకు ఇబ్బందిగా ఉందని ఆయా రాష్ట్రాలకు సంబంధించిన ఆర్థిక మంత్రులు, ప్రతినిధులు అసంతృప్తి బహిరంగంగానే వ్యక్తం చేశారు.

 

 ఈ బుధవారం ఢిల్లీ, పంజాబ్, మధ్యప్రదేశ్ కు చెందిన ఆర్థిక మంత్రులు అలాగే కేరళ, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ను కలిశారు. ఈ సమావేశం తర్వాత మీడియా ఎదుటనే వారు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. మీడియాతో పంజాబ్ ఆర్థిక మంత్రి మాట్లాడుతూ మేము కేంద్ర ఆర్థిక మంత్రి తో జిఎస్టి పరిహారం గురించి మాట్లాడడం అక్టోబర్- నవంబర్ నెలలకు సంబంధించిన పరిహారం గడువు ఇప్పటికే వచ్చేసింది కేంద్రంపై మాకు డబ్బులు చెల్లించాల్సిన బాధ్యత ఉంది. మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము మేము ప్రతి సారి డబ్బులు అడగడానికి ఢిల్లీ వరకు రాలేము. ఇది మాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. డబ్బులు రాకపోవడంతో మేము పాఠశాలలు నడపలేము, పెన్షన్లు ఇవ్వలేకపోతున్నామని వారు చెబుతున్నారు.

 

సమావేశం తర్వాత పరిహారం చెల్లిస్తామని ఆర్థిక మంత్రి చెప్పారు కానీ ఎప్పుడు ఇస్తారు అనేది స్పష్టం చేయలేదని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇవ్వవలసిన వాటా దాదాపు 50 వేల కోట్ల రూపాయల వరకు ఉందని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా చెప్పారు. ఆగస్టు- సెప్టెంబర్ నెలకు సంబంధించిన రాష్ట్రాలకు చెల్లించాల్సిన పరిహారం కేంద్రం ఇంకా చెల్లించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: