దిశ ఘటన తరువాత పోలీసులు చాలా అలర్ట్ గా ఉంటున్నారు.  100 కి ఫోన్ చేస్తే తక్షణమే సహాయం అందించేందుకు సిద్ధంగా ఉంటున్నారు.  ఎక్కడి నుంచి ఫిర్యాదులు ఇచ్చినా తీసుకోవాలనే ఆర్డర్ ఉండటంతో పోలీసులు దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకుంటున్నారు.  ఎవరైనా సరే అలసత్వం ప్రదర్శించినా.. వెంటనే స్పందించకపోయినా సరే... వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ పోలీస్ శాఖ ఇటీవలే చెప్పిన సంగతి తెలిసిందే.  దీంతో ఇప్పుడు హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా శివారు ప్రాంతంలో మహిళలు ఎక్కువగా సంచరించే ప్రాంతంలో గస్తీ ముమ్మరం చేశారు.  


ఇక ఇదిలా ఉంటె, ఎక్కడి నుంచి 100 కి ఫోన్ చేసినా పోలీసులు రెస్పాండ్ అవుతున్నారు.  వెంటనే ప్రమాదం ఎక్కడ ఉన్నదో అక్కడి పోలీసులకు ఏదంటే ఆ ప్రాంతంలో ఉండే పోలీస్ స్టేషన్ ను అలర్ట్ చేస్తున్నారు.  ఇదిలా ఉంటె, నల్గొండ జిల్లాలోని గుండ్లపల్లి క్రాస్ రోడ్ లో ఇందిరమ్మ కాలనీలో విజయలక్ష్మి అనే మహిళ నివసిస్తోంది.  ఆమె కుటుంబ సభ్యులను పక్కింటి వ్యక్తులు వేధింపులకు గురి చేస్తున్నారట.  


ఇలా వేధింపులకు గురి చేస్తుండటంతో సదరు మహిళ 100 కిడయల్ చేసింది.  వెంటనే ఆమెకు ఓ టెక్స్ట్ మెసేజ్ వచ్చింది.  మిమ్మల్ని వన్ టౌన్ పోలీసులు సంప్రదిస్తారు అని చెప్పి మెసేజ్ వచ్చింది.  ఎంత సేపు వెయిట్ చేసినా రెస్పాన్స్ లేకపోవడంతో సదరు మహిళా టెక్స్ట్ మెసేజ్ ఆధారంగా వన్ టౌన్ పోలీసులకు ఫోన్ చేస్తే.. మాకు సమయం లేదు.. భోజనమా చేస్తున్నాం.. మీరు వచ్చి కంప్లైంట్ ఇవ్వండి.. వచ్చి నిందితులను పట్టుకుంటాం అని చెప్పారట.

 
దీంతో సదరు మహిళా షాక్ అయ్యింది.  వెంటనే ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 100 కి డయల్ చేస్తే పోలీసులు వస్తారని అన్నారని, కానీ, పోలీసులు రాలేదని, ఫోన్ చేస్తే భోజనం చేస్తున్నాం సమయం లేదు మీరే వచ్చి కంప్లైన్ట్ ఇవ్వండి నిందితులను పట్టుకుంటాం అని అంటున్నారని చెప్పి సోషల్ మీడియాలో ఆవేదన తెలిపింది.  దీనిపై పోలీసు అధికారులు స్పందించారు.  వెంటనే సదరు పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.  దిశ విషయంలో స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకున్నారో అందరికి తెలిసిందే కదా.   

మరింత సమాచారం తెలుసుకోండి: