ప్రేమ కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు ప్రేమికులు. ప్రేమ కోసం పెద్దలను ఎదిరించి ఎక్కడికైనా వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవడానికి అయినా సరే రెడీ అంటారు. అదే ప్రేమ కోసం ఎలాంటి త్యాగం చేయడానికైనా వెనుకాడరు కొంతమంది ప్రేమికులు. ఇక్కడ అలాంటి ఘటనే జరిగింది.  ఒకరి నొకరు ఇష్టపడ్డారు. అయితే పెళ్లి చేసుకొని ఒక్కటవుదాం అనుకున్నారు. అయితే అన్ని  లవ్ స్టోరీస్ లాగానే నీ ప్రేమ కథకు కూడా చాలా ఆటంకాలు ఎదురయ్యాయి. చివరికి పంచాయతీ పోలీసుల వద్దకు కూడా చేరింది వీళ్ళ ప్రేమ కథ. ఇప్పటి వరకు అంతా రొటీన్ గానే ఉన్న ఈ కథలో ట్విస్ట్ ఎక్కడుందో తెలుసా... ఇక్కడ ప్రేమించుకున్నది  ఒక అబ్బాయి ఒక అమ్మాయి కాదండోయ్ ఇద్దరు యువకులు ప్రేమించుకున్నారు. 

 

 

 ఆశ్చర్య పోయారు కదా ఇద్దరు యువకులు ప్రేమించుకోవడం ఏంటని  అనుకుంటున్నారా. కానీ నేను చెప్పేది మాత్రం నిజమేనండోయ్ . ఇద్దరు యువకుల మధ్య మొదట పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత పరిచయం కాస్తా ప్రేమగా మారిపోయింది. దీంతో ఇద్దరు యువకులు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ ఇతరుల యువకుడు మాత్రం మరో యువకుని లింగ మార్పిడి  చేసుకుంటేనే పెళ్లి చేసుకుంటాను  అని తెగేసి చెప్పాడు. ఇక మరో యువకుడు చేసేదేమీలేక ఆ యువకుని వదలలేక లింగమార్పిడి చేయించుకున్నాడు. ఈ కథలో మరో ట్విస్ట్ ఏంటంటే రెండు యువకుడు లింగమార్పిడి చేసుకున్న తర్వాత మొదటి యువకుడు మాత్రం పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాడు. దీంతో రెండో యువకుడు షాక్  ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

 

 

 సూర్యాపేట జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. సూర్యాపేట జిల్లా ఎల్లంపేట కు చెందిన ఓ యువకుడు ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తూ ఉంటాడు. అయితే ఈ యువకుడు  సూర్యాపేటకు చెందిన మరో యువకుడితో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్తా స్నేహంగా... స్నేహం కాస్తా ప్రేమగా మారిపోయింది. అయితే ప్రేమ పేరుతో దగ్గరైన ఇద్దరు యువకులు పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు. అయితే అందులో ఓ యువకుడు మాత్రం రెండో యువకుని లింగ మార్పిడి చేసుకుని ఆడపిల్లగా  మారితే పెళ్లి చేసుకుంటానని తేల్చిచెప్పేశాడు. దీంతో రెండో యువకుడు లింగ మార్పిడి చేసుకున్నాడు. తీరా రెండో యువకుడు లింగమార్పిడి చేసుకున్న తర్వాత మరో యువకుడు మాత్రం పెళ్లికి నిరాకరించాడు.దీంతో  లింగ మార్పిడి చేసుకున్న పోలీసులను ఆశ్రయించారు. ఈ పంచాయతీ తేల్చడానికి పోలీసులు కూడా తలలు పట్టుకున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: