వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో టిడిపి నేతలకు సిట్ బృందం నోటీసులివ్వటంతో దర్యాప్తు కీలక మలుపు తిరగనున్నట్లు సమాచారం. హత్యకేసులో  విచారణకు రామ్మంటూ టిడిపి ఎంఎల్సీ బిటెక్ రవికి సిట్ నోటిసులివ్వటం సంచలనంగా మారింది.  టిడిపికి రాజీనామా చేసి బిజెపిలో చేరిన మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డికి కూడా తొందరలోనే నోటిసులు అందటం ఖాయమని ప్రచారం జరుగుతోంది. దాంతో హత్యకేసు విచారణ క్లైమ్యాక్స్ కు చేరుకున్నట్లే అనుకోవాలి.

 

మొన్నటి మార్చి 15వ తేదీన తెల్లవారుజామున వివేకానందరెడ్డి హత్యకు గురైన విషయం అందరికీ తెలిసిందే. సరిగ్గా ఎన్నికలకు ముందు అందులోను తెలుగుదేశంపార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు హత్య జరగటం సంచలనంగా మారింది. వివేకా స్వయంగా జగన్మోహన్ రెడ్డి బాబాయ్ కావటం, అంతకుముందే తనకు ప్రాణహాని ఉంది కాబట్టి వ్యక్తి భద్రతను పెంచాలని వివేకా అడిగినా ఎస్పీ కుదరదని చెప్పిన వెంటనే  హత్య జరగటంతో  రాజకీయంగా కావాల్సినంత రచ్చ జరిగింది.

 

హత్య జరిగిన వెంటనే చంద్రబాబు నానా హడావుడి చేసేశారు. ప్రత్యేక దర్యాప్తు బృందం పేరుతో సిట్ ను ఏర్పాటు చేసినా దర్యాప్తులో మాత్రం ఎటువంటి పురోగతి కనబడలేదు. అప్పట్లోనే వివేకా హత్య ఘటనలో టిడిపి నేతల హస్తముందని వైసిపి నేతలు ఆరోపణలు చేశారు. అయితే  వివేకా హత్య వైఎస్ కుటుంబ సభ్యుల పనే అంటూ చంద్రబాబు అండ్ కో కూడా ఎదురుదాడికి దిగటంతో ఘటనపై నానా రచ్చ జరిగింది.

 

ఈ నేపధ్యంలోనే అప్పట్లో మంత్రిగా ఉన్న ఆదినారాయణరెడ్డి పాత్ర ఉందనే ఆరోపణలు కూడా వినిపించాయి. అయితే టిడిపి అధికారంలో ఉండటం, చంద్రబాబుకు బాగా సన్నిహితంగా ఉండటం వల్ల ఆది నారాయణరెడ్డిని సిట్ బృందం విచారణకు పిలవలేదు.  

అయితే అధికారం మారగానే సిఎం అయిన వెంటనే జగన్ కొత్తగా సిట్ బృందాన్ని ఏర్పాటు చేశారు. దాంతో టిడిపి కీలక నేతలను సిట్ విచారణకు పిలుస్తోంది. ఇందులో భాగమే బిటెక్ రవికి నోటీసులని అనుకోవాలి. ఆదినారాయణరెడ్డిని కూడా విచారణకు పిలిస్తే దర్యాప్తు దాదాపు క్లైమ్యాక్స్ కు వచ్చినట్లే అనుకోవాలి. చూద్దాం ఏం జరుగుతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: