దిక్కు దివాణం లేని కమలం పార్టీ రాష్ట్రంలో బలపడేందుకు పెద్ద మాస్టర్ ప్లానే వేసినట్లు అనుమానంగా ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్న ఏపి విషయానికి వచ్చేసరికి బిజెపి బలం గుండుసున్నాయే. వచ్చే ఎన్నికలనాటికి తాను ప్రధాన ప్రతిపక్షంగా ఎదగాలని అనుకున్న బిజెపి అందుకు తగ్గట్లే పావులు కదుపుతున్నట్లుంది. ఇందులో భాగమే జనసేన పార్టీని విలీనం చేసుకోవటం.

 

నిజానికి జనసేనను తనలో విలీనం చేసుకోవటం వల్ల బిజెపికి వచ్చే లాభమేమీ లేదనే చెప్పాలి. ఎందుకంటే బిజెపికి ఎంత బలముందో జనసేనకు కూడా అంతే బలముంది ఏపిలో. మొన్నటి ఎన్నికల్లో రెండు పార్టీలకు వచ్చింది సుమారుగా 5 శాతం ఓట్లే. ఇందులో జనసేనకు సుమారుగా 3.5 శాతముంటే మిగిలింది బిజెపి షేర్.

 

చాలా నియోజకవర్గాల్లో బిజెపి, జనసేనకు సమానంగా ’నోటా’కు ఓట్లు పడ్డాయంటేనే రెండింటి బలమేంటో అర్ధమైపోతోంది. ఈ నేపధ్యంలోనే రెండు పార్టీలు కలిస్తే ఎంత ? కలవకపోతే ఎంత ? ఇక్కడే ఉంది బిజెపి మాస్టర్ ప్లాన్ . తెలుగుదేశంపార్టీని రాష్ట్రంలో ఖాళీ చేయించాలనే ప్లాన్ తో బిజెపి ముందుకుపోతోంది. ముందుగా టిడిపి తరపున గెలిచిన 23 మందిలో సగంమందిని లాగేసేందుకు పావులు కదుపుతోంది. దానివల్ల చంద్రబాబుకు ప్రధాన ప్రతిపక్షహోదా పోతుంది. అంటే టిడిపికి పడే మొదటి దెబ్బ అదేన్నమాట.

 

ఎన్నికల సమయానికి మెల్లిగా టిడిపిని కూడా తనలో విలీనం చేసేసుకోవాలన్నది బిజెపి పెద్దల అసలు ప్లాను.  ఇదే విషయంలో చంద్రబాబు బిజెపి పెద్దలతో విభేదిస్తున్నట్లు పార్టీలోనే ప్రచారం జరుగుతోంది. కాబట్టి టిడిపి వీలనం అంత తొందరగా జరిగే అవకాశాలు కనిపించటం లేదు. అందుకనే ముందు జనసేన నుండి నరుక్కొస్తున్నారు.

 

బిజెపి పెద్దల ప్లాన్ గనుక వర్కవుటైతే వచ్చే ఎన్నికల్లో వైసిపి-బిజెపిలు మాత్రమే పోటిలో ఉంటాయి. వామపక్షాల్లాంటివి ఉన్నా ఉనికి కోసమే అవస్తలు పడుతున్నాయి కాబట్టి ఆ పార్టీల గురించి ఆలోచించాల్సినవసరం లేదు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: