రాష్ట్ర ప్రజలకు అత్యంతముఖ్యమైన అమరావతి అభివృద్ధిని నిలిపేసి, నవ్యాంధ్రప్రదేశ్‌ కు బంగారు గుడ్లుపెట్టే బాతైన రాజధానిని అడ్డంగాకోసేసి తినేసే పరిస్థితికి జగన్‌ప్రభుత్వం వచ్చిందని టీడీపీ పొలిట్‌బ్యూరోసభ్యులు, మాజీమంత్రి కింజారపు అచ్చెన్నాయుడు మండి పడ్డారు.  తెలుగుదేశంపార్టీ ఆధ్వర్యంలో విజయవాడలో డిసెంబర్ 5వ తేదీన రాజధానిపై నిర్వహించనున్న రౌండ్‌టేబుల్‌ సమావేశవివరాలను ఇరువురునేతలు విలేకరులకు వివరించారు. అమరావతిపై రాష్ట్ర మంత్రులు ఎవరికితోచినట్లు వారు మాట్లాడుతున్నారన్నారు. 


రాజధానిలో తెలుగుదేశం ప్రభుత్వం గ్రాఫిక్స్‌ చూపిందని, కనీసం అక్కడ టాయ్‌లెట్లుకూడాలేవని పురపాలకశాఖ మంత్రి చెబితే, మరోమంత్రేమో రాజధానిలో గొర్రెలు, బర్రెలు తిరుగుతున్నాయని చెప్పడం బాధాకరమన్నారు. అమరావతి నిర్మాణాలను ప్రపంచానికి తెలియచేయడానికే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆప్రాంతంలో పర్యటించాడన్నారు. 5ఏళ్లు టీడీపీ అధికారం లో ఉన్నా, చివరి రెండేళ్లలోమాత్రమే అమరావతిలో నిర్మాణపనులు చేసిన విషయాన్ని  వైసీపీ ప్రబుద్ధులు తెలుసుకోవాలని అచ్చెన్నాయుడు సూచించారు. 

 

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలవారికి ఆమోదయోగ్యంగా ఉండేలా రాష్ట్రంమధ్యలో ఉండేప్రాంతాన్ని రాజధాని గా ఎంపికచేయడం జరిగిందన్నారు. ఆతరువాత శాసనసభ, శాసనమండలి, హైకోర్టు, సచివాలయం వంటినిర్మాణాలను పూర్తిచేశామన్నారు. వైసీపీప్రభుత్వం వచ్చిన 6నెలల్లో ఎక్కడా తట్టమట్టికూడా వేయలేదన్నారు. రాజధానినిర్మాణంలో ప్రభుత్వంపైఒత్తిడి తీసుకొచ్చే క్రమంలో టీడీపీ నిర్వహిస్తున్న  రౌండ్‌టేబుల్‌ సమావేశానికి 17 రాజకీయ పార్టీలకు ఆహ్వానాలు పంపినట్లు మాజీమంత్రి తెలిపారు. 90శాతం పార్టీలు సమావేశానికి వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. అమరావతి అనేది తెలుగుదేశానికి సంబంధి ంచినది కాదని, 5కోట్లమంది గర్వించాల్సిన అతిముఖ్యమైన అంశమని అచ్చెన్నాయుడు తెలిపారు. రాజధాని ఒకవర్గానికో, రెండు,మూడుజిల్లాలకో, ఒకప్రాంతానికో పరిమితం కాదనే విషయాన్ని ప్రభుత్వం గ్రహించాలన్నారు. రాష్ట్రం ఆర్థికంగా బలపడాలంటే రాజధా ని నిర్మాణం జరగడం అత్యంతకీలకమనే విషయాన్ని ప్రభుత్వం తెలుసుకుంటేమంచిదన్నా రు. రౌండ్‌టేబుల్‌ సమావేశానికి పాత్రికేయులు కూడా తప్పనిసరిగా హాజరవ్వాలన్నారు.

 

6నెల్ల నుంచి రాష్ట్రం అనేక ఇబ్బందుల్లో కూరుకుపోయిందని, వైసీపీపాలనలో మంటగలిసి న రాష్ట్రప్రతిష్టను తిరిగితీసుకురావడం ఎవరివల్లా కాదన్నారు. తానో, పవన్‌కల్యాణో అన్నాడని కాకుండా రాష్ట్రభవిష్యత్‌కోసం ఎవరిపాత్రవారు సక్రమంగా నిర్వర్తిస్తేనే భావితరాలకు మంచిదన్నారు. జనసేన అధినేత తన అభిప్రాయం చెప్పారని, రాష్ట్రాని కాపాడటంకోసమే తమపార్టీ  ప్రయత్నిస్తోంది తప్ప, వ్యక్తిగతఅంశాలు, అజెండాలు లేవని అచ్చెన్నాయుడు తేల్చిచెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: