ఈ మధ్య కాలంలో యువతలో చాలామంది మొబైల్ ఫోన్ ను ఛార్జింగ్ పెట్టి ఉపయోగిస్తున్నారు. మొబైల్ ఫోన్ ను ఛార్జింగ్ పెట్టిన సమయంలో ఉపయోగించటం వలన గతంలో ఎన్నో సందర్భాల్లో మొబైల్స్ పేలిన ఘటనలు జరిగాయి. యువతలో చాలామంది మొబైల్ ఫోన్ ఛార్జింగ్ లో ఉండగానే పాటలు వినటం, గేమ్స్ ఆడటం, వీడియోలు చూడటం చేస్తూ ఉంటారు. కానీ అలా చేయటం ఎంత ప్రమాదకరమో తాజాగా జరిగిన ఒక ఘటన ద్వారా తెలుస్తోంది. 
 
కిట్టిశాక్ మూన్ కిట్టి అనే 28 సంవత్సరాల యువకుడు మొబైల్ ఫోన్ లో రెండు రోజుల క్రితం మధ్యాహ్నం సమయంలో గేమ్స్ ఆడాడు. గేమ్స్ ఆడుతున్న సమయంలో మొబైల్ లో ఛార్జింగ్ అయిపోయింది. మొబైల్ కు ఛార్జింగ్ అయిపోయినా కిట్టిశాక్ మూన్ కిట్టి మొబైల్ కు ఛార్జింగ్ పెట్టి గేమ్స్ ఆడుతూనే ఉన్నాడు. కానీ ఛార్జింగ్ పెట్టిన సమయంలో ప్రమాదవశాత్తూ ఛార్జర్ నుండి కరెంట్ యువకుడి శరీరానికి పాస్ అయింది. 
 
కరెంట్ షాక్ కొట్టడంతో యువకుడు సెకన్ల వ్యవధిలో మరణించాడు. కిట్టిశాక్ ను అతని తల్లి కొంత సమయం తరువాత పిలవగా కిట్టిశాక్ పలకకపోవడంతో కిట్టిశాక్ ఉండే గదికి వెళ్లి చూసి తల్లి షాక్ కు గురైంది. షాక్ కొట్టడంతో తన కొడుకు కదలటం లేదని గుర్తించి ఒక కర్ర సహాయంతో కిట్టిశాక్ ను కదిలించింది. కానీ కిట్టిశాక్ కదలలేదు. ఎమర్జెన్సీ సర్వీసుకు కిట్టిశాక్ తల్లి కాల్ చేయగా వారు కిట్టిశాక్ నివాసానికి చేరుకొని కిట్టిశాక్ చనిపోయాడని తెలిపారు. 
 
పోలీసులు కిట్టిశాక్ కు ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ కొట్టిందని కిట్టిశాక్ శరీరానికి గాయాలయ్యాయని కరెంట్ షాక్ వలనే కిట్టిశాక్ చనిపోయినట్లు తెలిపారు. పోస్టుమార్టం కొరకు కిట్టిశాక్ మృతదేహాన్ని తరలించారు. మొబైల్ ఫోన్ ను ఛార్జింగ్ లో పెట్టి ఉపయోగించటం ప్రమాదమని మొబైల్ ఫోన్ ఛార్జింగ్ లో లేని సమయంలో మాత్రమే ఉపయోగించాలని నిపుణులు చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: