తెలుగుదేశం పార్టీ ఒక వెలుగు వెలిగిన జిల్లాల్లో గోదావరి జిల్లాలు ముందు వరుసలో ఉంటాయి అనేది వాస్తవం. రాజకీయంగా ఆ పార్టీకి ముందు నుంచి ఆ రెండు జిల్లాలు అండగా నిలిచాయి... ఆ పార్టీకి కమ్మ సామాజిక వర్గం ఈ జిల్లాల్లో అండగా నిలబడింది. ముందు నుంచి ఆ పార్టీకి అండగా ఉన్న బీసీలు కూడా పార్టీని మోశారు. అయితే మొన్నటి ఎన్నికల్లో మాత్రం పార్టీకి వాళ్ళే దూరమయ్యారు. గ్రూపు తగాదాలు, ప్రజల్లో వ్యతిరేకత వంటివి ఇబ్బంది పెట్టాయి. అందుకే... పార్టీ ఘోరంగా ఓటమి పాలైంది అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు.

 

ఇప్పుడు పార్టీ ఓటమి పాలు అయినా సరే కొందరి నేతల తీరు మాత్రం మారలేదు. ఇటీవల చంద్రబాబు పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనకు వచ్చారు. ఈ పర్యటనలో ఆయన ఎక్కువగా సీనియర్ నేతలకే ప్రాధాన్యత ఇచ్చారు. ఎంత సేపు వారి వల్ల‌ ఏర్పడిన గ్రూపు తగాదాల మీదే చంద్రబాబు ఎక్కువగా దృష్టి పెట్టి వాళ్ళను శాంతింపచేసే ప్రయత్నం చేసారు. ఇక పనిలో పనిగా చంద్రబాబు కార్యకర్తలతో సమావేశమై వాళ్ళ సమస్యలను కూడా పరిష్కరించడం మీద ఎక్కువగా దృష్టి పెట్టి మాట్లాడారు. ఇప్పుడు ఇదే యువనేతలకు మంటగా మారింది.

 

వాళ్ళు పార్టీ కోసం ఎన్నికల్లో అంత కష్టపడినా సరే తమకు ఏ మాత్రం గుర్తింపు లేదనే భావనలో యువనేతలు ఉన్నారు. పార్టీలో ఒకప్పుడు బలంగా ఉన్న నేతలకే గాని తమకు ఏమాత్రం గుర్తింపు లేదని తమను కనీసం పిలిచి కూడా మాట్లాడలేదని బాధపడుతున్నారు. అందుకే ఇప్పుడు పార్టీ మారాలని భావిస్తున్నారు. యువనేతలకు ప్రాధాన్యత ఉన్నా సరే... అది నాయకుల కుమారులకే ఉంది గాని పార్టీ కోసం ఒళ్ళు గుల్ల చేసుకున్న తమకు ఎంత మాత్రం లేదని, ఆర్ధికంగా చితికిపోయిన తమతో కనీస౦ చంద్రబాబుకి ఫోటో దిగే ఖాళీ కూడా లేదా అంటూ అసహనం వ్యక్తం చేస్తూ వైసీపీ నేతలతో టచ్ లోకి వెళ్తున్నారట.  

మరింత సమాచారం తెలుసుకోండి: