మీకు బ్యాంకులో డ‌బ్బుందా?  సేమింగ్స్ ఖాతా కావ‌చ్చు లేక‌పోతే ఫిక్స్‌డ్ డిపాజిట్ కావ‌చ్చు లేదా క‌రెంట్ అకౌంట్ రూపంలో అయినా... ఆఖ‌రికి కంపెనీ సొమ్ము అయినా కావ‌చ్చు..బ్యాంకులో ఉన్న డ‌బ్బు విష‌యంలో కంగారు ప‌డాల్సిన సంద‌ర్భం ఇది. ఎందుకంటే... బ్యాంక్ డిపాజిట్లకు సంబంధించి బీమా పరిమితి విష‌యంలో...డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) అనే కీల‌క సంస్థ సంచ‌ల‌న స‌మాచారం ఇచ్చింది. ఇప్పుడు ఈ ప్ర‌క‌ట‌న సామాన్యుడి నుంచి మొద‌లుకొని మాన్యుడి వ‌రకూ షాకింగ్ లాగా మారింది.

 

ఇంత‌కీ ఏంటా సంఘ‌ట‌న అంటే... bank OF INDIA' target='_blank' title='రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అనుబంధ సంస్థే డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ). అన్ని వాణిజ్య, విదేశీ, స్థానిక, ప్రాంతీయ బ్యాంక్ డిపాజిట్లకు డీఐసీజీసీ బీమా సదుపాయాన్ని కల్పిస్తుంది. బ్యాంకులు ఏ కారణంగానైనా డిపాజిటర్ల సొమ్మును చెల్లించలేనిపక్షంలో ఖాతాదారులకు ఈ బీమాను అందిస్తుంది. ఈ బీమా కోసం ఖాతాదారులు ఎలాంటి సొమ్మునూ చెల్లించనక్కర్లేదు. అయితే ఖాతాల్లో ఎంత మొత్తమైనా ఉన్నప్పటికీ దానికి రూ.లక్షకు మించి బీమాను డీఐసీజీసీ అందివ్వడం లేదు. ప్రస్తుతం డిపాజిట్లపై అందుబాటులో ఉన్న బీమా రూ.లక్ష వరకేనని సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా పీటీఐ పెట్టుకున్న దరఖాస్తుకు సమాధానమిచ్చింది. అంతేకాకుండా....బ్యాంక్ డిపాజిట్లకు సంబంధించి బీమా పరిమితిని పెంచడంపై త‌మకు ఎలాంటి సమాచారం లేదని డీఐసీజీసీ స్పష్టం చేసింది. 

 

ఎందుకు ఇప్పుడు ఈ క్లారిటీ ఇచ్చిందంటే...ఇటీవ‌ల పంజాబ్ అండ్ మహారాష్ట్ర సహకార బ్యాంక్ (పీఎంసీ) కుంభకోణం జరిగిన సంగ‌తి తెలిసిందే. ఈ స్కాం నేపథ్యంలో ఈ బీమాను పెంచాలన్న డిమాండ్లు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం సైతం ఇందుకు సానుకూలంగానే ఉండగా, గత నెల కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ మేరకు సంకేతాలను ఇచ్చారు. ఈ పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో బ్యాంక్ డిపాజిట్లపై ఉన్న రూ.లక్ష బీమాను పెంచే యోచనలో ప్రభుత్వం ఉందని చెప్పారు. పీఎంసీ వ్యవహారం నేపథ్యంలో ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ సంఘాలు కూడా వ్యక్తిగత డిపాజిట్ ఇన్సూరెన్స్ పరిమితిని రూ.5 లక్షలకు పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో బీమాను పెంచే ప్రతిపాదనలు ఏమైనా ఉన్నాయా? అంటూ ఆర్టీఐ ద్వారా వచ్చిన ప్రశ్నకు డీఐసీజీసీ అలాంటివేమీ లేవని తేల్చి చెప్పింది. అంటే..బ్యాంకులో ఉన్న మ‌న సొమ్ముకు స‌ర్కారు ఇచ్చే గ్యారంటీ ల‌క్ష మాత్ర‌మేన‌న్న‌మాట‌.

మరింత సమాచారం తెలుసుకోండి: