ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి  ప్రతి విషయంలో టీడీపీ అదినేత ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జగన్ ప్రభుత్వం పై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. జగన్ ప్రభుత్వ హయాంలో టీడీపీ కార్యకర్తలపై దాడి చేయడంతో... రాష్ట్ర ప్రజలు  భయభ్రాంతులకు గురి చేయడం విచ్చలవిడిగా దోచుకోవడం తప్ప ఏమీ సాధించలేదు అంటూ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు విమర్శలు గుప్పించారు.వైయస్ జగన్మోహన్ రెడ్డి అసమర్థ పాలన వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చే ఆదాయం 30 శాతం మేర పడిపోయినట్టు ఆరోపించారు చంద్రబాబు. 

 

 

 భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పులు పుట్టే పరిస్థితి కూడా లేదని విరుచుకుపడ్డారు. అంతే కాకుండా దేశ వ్యాప్తంగా భారీగా పెరిగిన ఉల్లి ధరలపై కూడా చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతగానితనం వల్లే రాష్ట్రంలో ఉల్లి ధర నూట పది రూపాయలకు చేరినదని  టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. రైతులకు తమ పంటకు గిట్టుబాటు ధర లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. 

 

 

 

 వైసీపీ పాలన ఇలాగే కొనసాగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాస్త దివాళా తీయడం ఖాయమంటూ ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. కర్నూలు పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబు నాయుడు ఈ  వ్యాఖ్యలు చేశారు. టీడీపీ శ్రేణుల పై వైసీపీ నేతలు మానసికంగా శారీరకంగా దాడులు చేస్తూ కుంగదీసే ప్రయత్నం చేస్తున్నారంటూ చంద్రబాబునాయుడు విమర్శించారు. టీడీపీ శ్రేణుల పై తప్పుడు కేసులు బనాయించి వైసిపి నేతలు  భయబ్రాంతులకు గురి చేస్తున్నారని విరుచుకుపడ్డారు. ఎమ్మిగనూరు నియోజకవర్గం లో  చంద్రబాబు ఓ ఎస్సి  వ్యక్తిని అధికార వైసీపీ నేతలు ఉద్యోగం నుంచి తొలగించారు అంటూ చంద్రబాబు నాయుడు ఆరోపించారు . అది తట్టుకోలేక ఆ వ్యక్తి తండ్రి గుండె ఆగిపోయింది అని తెలిపారు. ఆఫీస్ కి వెళ్తే వైసిపి శ్రేణులు దాడి చేశారని ఆ వ్యక్తి తెలిపినప్పటికీ పోలీసులు మాత్రం పట్టించుకోలేదని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి ఉండడంతో చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు దుర్మార్గంగా ప్రవర్తిస్తే...మూల్యం  చెల్లించుకోవాల్సి వస్తుందని చంద్రబాబు నాయుడు హెచ్చరించారు .

మరింత సమాచారం తెలుసుకోండి: