రాష్ట్రాన్ని కుదిపేస్తున్న దిశ కేసు విచారణ దిశగా కీలక అడుగు పడింది. రాష్ట్ర ప్రభుత్వ వినతికి సానుకూలంగా స్పందించిన మహబూబ్‌నగర్‌లో ఫాస్ట్‌ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు అనుమతి ఇస్తూ బుధవారం డిసెంబర్ 4 హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. . మహబూబ్‌నగర్ మొదటి అదనపు సెషన్స్, జిల్లా న్యాయస్థానాన్ని ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టుగా ప్రకటించింది.

 

 

ఇకపోతే రాష్ట్రాన్నే కాకుండా దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపిన ఈ కేసు విచారణను త్వరితగతిన ముగించి నిందితులకు కఠిన శిక్ష విధించేలా కేసీఆర్ సర్కార్ చర్యలు చేపట్టింది. ఈ కేసు విచారణకు ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించింది. తాజాగా హైకోర్టు ఆమోదం తెలపడంతో ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం తదుపరి చర్యలు చేపట్టింది. ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులో ఈ కేసుపై రోజువారీ పద్ధతిలో విచారణ జరిపి, నిందితులకు త్వరితగతిన శిక్ష పడేలా చర్యలు తీసుకోనున్నారు.

 

 

ఇకపోతే ఈ ఘటనకు పాల్పడిన నిందితులు ఆర్ధిక స్దోమత లేని వారైతే ప్రభుత్వ లాయర్లను ఏర్పాటు చేసుకునే వెసులు బాటును కల్పించింది ఫాస్ట్‌ ట్రాక్ కోర్టు. ఇక సాక్షులకు సమన్లు జారి చేసిన కోర్టు విచారాణ తేదీలు కూడా జారిచేసింది. ఇదే కాకుండా ఇప్పుడు సాక్షుల సంఖ్యను బట్టి విచారణ ఎప్పుడు పూర్తవుతుందో తెలిసే అవకాశం ఉందని ఈ సందర్భంగా వెల్లడించింది. ఇకపోతే ఈ విచారణలో భాగంగా లారీ యజమానినితో పాటుగా టోల్ గేట్, పెట్రోల్ బంక్ సిబ్బందిని విచారించనున్నారు.

 

 

వీరితో పాటుగా దిశ సోదరిని, వారి తల్లిదండ్రులను సాక్షులుగా పేర్కొని విచారణకు సిద్దమవుతున్నారు. ఇకపోతే విచారణ మొదలుపెట్టాక రెండు వారాల్లో ఫాస్ట్‌ ట్రాక్ కోర్టులో విచారణ పూర్తైయ్యే అవకాశం వుందని న్యాయాధికారులు పేర్కొంటున్నారు. ఇకపోతే ఈ సంఘటనపై ఇప్పటికే రాష్ట్రప్రజలు కోపంతో, ఆవేశంతో రగిలిపోతున్న విషయం తెలిసిందే వీలైనంత త్వరగా దోషులను శిక్షించాలని ఇప్పటికే నిరసనలు వెల్లువెత్తుతున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: