సిటీలో ఆటో డ్రైవర్ల మోసం మాటల్లో చెప్పలేం. ఎన్ని నిబంధలను ట్రాఫిక్ పోలీసులు పెట్టిన... వారు చేసే మోసాలు మాత్రం కొనసాగుతూనే ఉంటాయి. మీటర్లు ఉన్నపటికీ... వాటిని అసలే వేయరు. ప్రయాణికులపై ఎక్కువ భారాన్ని మోపి... బాగా డబ్బులు సంపాదించడం చేస్తుంటారు. దాంతో... చాలా మంది ప్రయాణికులు ఆటోలలో ప్రయాణించడానికే భయబడి... క్యాబ్స్ లో వెళ్తుంటారు. అయితే... బెంగళూరు నగరంలోని ప్రజలు ఆటో వారిపై తరచుగా పిర్యాదు చేస్తున్నారు. దీంతో సిలికాన్ వ్యాలి నగరమైన బెంగళూర్‌లో పోలీసులు ఆటో డ్రైవర్ల మోసాన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలనుకున్నారు. అందుకోసం, పోలీసులే స్వయంగా... ప్రయాణికుల్లా రంగప్రవేశం చేసి ఆటోలని ఎక్కి ఆటో వాళ్ల మోసానికి చెక్ పెట్టాలని స్కెచ్ వేశారు.

వారు వేసిన ప్రణాళికను విజయవంతంగా అమలు చేసి... నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తున్న సుమారు 5200 ఆటో డ్రైవర్లను పట్టుకొని వారికి పెద్ద షాక్ ఇచ్చారు. అయితే నగరంలోని ఇతర ప్రాంతాలలో కూడా పోలీసులు సాధారణ ప్రయాణికుల్లా అవతారమెత్తి... నిబంధనలు బ్రేక్ చేస్తున్న ఆటో డ్రైవర్లకు చలాన్ విధించి... వారందరి నుంచి రూ. 8 లక్షల వరకు జరిమానాను వసూల్ చేసారు. సెప్టెంబర్ నెలలో కూడా పోలీసులు తెలివిగా వ్యవహరించి... 6800 మోసం చేసే ఆటో డ్రైవర్ల పై కేసులను నమోదు చేసి , రూ. 72 లక్షలను జరిమానాగా వసూలు చేశారు.


ఇంతకీ ఆటో వాళ్ళు ఉల్లంఘించిన నిబంధనలు ఏమిటంటే.. యూనిఫామ్ ని ధరించకపోవడం, ఎక్కువ చార్జీలను ప్రయాణికుల నుంచి తీసుకోవడం, డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడం, ఆటో కి సంబంధించిన దృవీకరణ పత్రాలు లేకపోవడం, మీటర్ ఉన్నా మీటర్ ని ఉపయోగించకుండా ప్రయాణికుల నుంచి ఎక్కువ డబ్బులు తీసుకోవడం. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా పోలీసులు ఇదే స్కెచ్ ఉపయోగించి ఆటో డ్రైవర్ల మోసానికి చెక్ పెట్టవచ్చని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు



మరింత సమాచారం తెలుసుకోండి: