కొద్దిరోజుల క్రితం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన పశువైద్యురాలు ప్రియాంక రెడ్డి హత్య ఘటనపై అందరి నుండి తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే. ప్రజలు, ప్రజా సంఘాలు మరియు మహిళా సంఘాలతో పాటు సెలెబ్రిటీలు కూడా గళమెత్తి, ఆ ఘటన నిందితులను కఠినాతి కఠినంగా శిక్షించి తీరాలని కోరుతున్నారు. ఇప్పటికే దేశంలో ఆడవారికి భద్రత లేకుండా పోయిందని చెప్పడానికి ఇటువంటి దారుణమైన ఘటనలే నిదర్శనం అని, ఎందరు పాలకులు మారినా స్త్రీకి సమాజంలో సంపూర్ణ రక్షణ మాత్రం కరువవుతోంది, కావున ఇకనైనా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు మేల్కొని ఇకపై ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. 

 

ఇక ఈ దుర్ఘటనలో నిందితులైన నలుగురు ముద్దాయిలు ఏ విధంగా తప్పించుకునే వీలు లేకుండా పోలీసులు గట్టి భద్రతను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇక నిన్న ఈ కేసు విషయమై ఒక కీలకమైన సంచలన సాక్ష్యం పోలీసులకు లభించిందని, ఆ సాక్ష్యంతో నిందితులు తప్పించుకునే అవకాశం అస్సలు లేకపోవడంతో పాటు వారికి బెయిల్ కూడాలభించే అవకాశం కూడా చాలావరకు లేనట్లు సమాచారం. అయితే హత్యానంతరం పట్టుబడిన నిందితులు మొదట పెద్దగా నిజాలు బయట పెట్టలేదని, కానీ అనంతరం పోలీసులు ఇచ్చిన థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్ తో మొత్తం నిజాలు చెప్పేశారని, 

 

ఆ ఆధారాలతోనే కీలక సాక్ష్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారని సమాచారం. ఇక ఈ కీచకులకు ఉరి శిక్షను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అమలు చేయాలని చాలామంది ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ కేసుని ఎంతో ఛాలెంజింగ్ గా తీసుకుందని, అవసరమైతే భారత రాజ్యంగా శిక్షా స్మృతిలో కొద్దిపాటి మార్పులు చేర్పులు చేసినా చేయొచ్చని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ అదే కనుక నిజమై, ఈ నీచులకు కఠిన శిక్షలు అమలైతే, ఇకపై ఇటువంటి తప్పులు చేయడానికి మృగాళ్లు భయపడతారని మహిళా సంఘాల వారు అంటున్నారు.....!!  

మరింత సమాచారం తెలుసుకోండి: