జనసేన త్వరలోనే బీజేపీ లో విలీనం కాబోతుందా ?, పవన్ కళ్యాణ్ అంతరంగం అదేనా ??, పవన్ కూడా తన అన్నయ్య చిరంజీవి బాటలోనే నడుస్తున్నారా ??? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్ లో ఎవరి నోటా చూసిన  ఇవే ప్రశ్నలు విన్పిస్తున్నాయి . దానికి కారణం లేకపోలేదు .  తిరుపతి ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలే ప్రజల్లోనూ , రాజకీయ నేతల్లోను ఈ తరహా అనుమానాలు రేకెత్తించడానికి  కారణమన్నది నిర్వివాదాంశం . ప్రత్యేక హోదా విషయం లోనే బీజేపీ తో విబేధించానని , బీజేపీ కి తాను ఎప్పుడు దూరంగా  లేనని పేర్కొన్న పవన్ , దేశ ప్రయోజనాలు , ప్రజల కోసం బీజేపీ చక్కటి  నిర్ణయాలను తీసుకుంటుందని చెప్పి,  త్వరలోనే తాను ఆ పార్టీ తో రాజకీయ స్నేహం చేయడం ఖాయమన్న సంకేతాలను ఇచ్చారు .

 

 

 గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన బీజేపీ తో కలిసే ఉన్నానన్న పవన్ వ్యాఖ్యలు పరిశీలిస్తే త్వరలోనే ఆయన తన పార్టీని బీజేపీ లో విలీనం చేస్తారేమోనన్న అనుమానాలు కలుగుతున్నాయని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు . రాజకీయ పార్టీని నడపడమంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదని పవన్ సోదరుడు చిరంజీవికి  గతంలోనే స్వానుభవం ద్వారా తెలిసిందని, ఇప్పుడు పవన్ కు బోధపడిందేమోనని ఎద్దేవా చేస్తున్నారు . గతం లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన చిరంజీవి కి ప్రజలు 18 ఎమ్మెల్యేల బలాన్ని కట్టబెట్టిన ఆయన ఐదేళ్లకాలం పాటు ప్రతిపక్షం లో కూర్చోలేక , పార్టీని నడపలేక కాంగ్రెస్ లో విలీనం చేసిన విషయం తెల్సిందేనని గుర్తు చేస్తున్నారు  .

 

ఇక ఇప్పుడు పవన్ వంతు వచ్చినట్లుంది , ఆయన తన పార్టీని బీజేపీ లో విలీనం చేస్తారేమోనని అనుమానాల్ని వ్యక్తం చేస్తున్నారు .  పవన్ తో పోలిస్తే రాజకీయంగా చిరంజీవి కాస్తా బెటరనే చెప్పాలని రాజకీయ పరిశీలకులు అంటున్నారు . ఎందుకంటే పవన్ కు ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఒక్క స్థానం మాత్రమే దక్కగా , ఆయన రెండు చోట్ల పోటీ చేసి ఓటమిపాలయ్యారు . ఇక చిరు తాను రెండు చోట్ల పోటీ చేసిన ఒక చోట విజయం సాధించారని అంటున్నారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: