చిత్తూరు జిల్లా పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్.. రైతులతో ముఖాముఖి నిర్వహించాలనుకున్నారు. ఏపీలోనే టమాటాలకు అతి పెద్ద మార్కెట్ అయిన మదనపల్లె మార్కెట్ యార్డులో టామాటా రైతులతో ముఖాముఖి నిర్వహించాలనుకున్నారు. కానీ రద్దీ ఎక్కువగా ఉంటుందననే కారణంతో అధికారులు అనుమతి నిరాకరించారు. దీనిపై పవన్ ఘాటుగా స్పందించారు.

 

చిత్తూరు జిల్లాలోని మదనపల్లె మార్కెట్‌ యార్డును సందర్శించకుండా తననెవరు ఆపుతారో చూస్తానని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ సవాల్‌ విసిరారు. మదనపల్లెలోని సీటీఎం రోడ్డులో కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన ... తన పర్యటనను అడ్డుకునే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. షెడ్యూల్‌ ప్రకారం తాను టమోటా రైతులతో మాట్లాడేందుకు కార్యక్రమం పెట్టుకుంటే అనుమతి నిరాకరించటం ప్రభుత్వ అహంకారానికి నిదర్శనమని పవన్ కల్యాణ్ మండిపడ్డారు.

 

అంతే కాదు.. తాను వైసీపీ దౌర్జన్యాలకు భయపడే రకం కాదని.. రైతులను కలిసేందుకు, వారి కష్టాలు వినేందుకు టమోటా మార్కెట్‌ను సందర్శించి తీరుతానని స్పష్టం చేశారు. వైసీపీ ఎమ్మెల్యే తనను అడ్డుకుంటారో చూస్తానంటూ పవన్‌ సవాల్‌ విసిరారు. మీరు అనుమతి ఇవ్వకపోతే చేతులు కట్టుకుని కూర్చుంటామా.. మేం గొర్రెలం కాదు. సింహాలం అంటూ గర్జించారు పవన్ కల్యాణ్.

 

మొత్తం మీద ఈ మదనపల్లె మార్కెట్ యార్డు సందర్శన వివాదాస్పదం అయ్యేలా కనిపిస్తోంది. ఎలాగైనా సందర్శించి తీరుతానని పవన్ పట్టుబట్టడంతో పోలీసులు అడ్డుకునే అవకాశం ఉంది. మరి పవన్ కల్యాణ్ ముందుగానే చెప్పినట్టు రోడ్డుపై కూర్చుంటే.. సమస్య మరింత జటిలం అయ్యే అవకాశం ఉంది. మరి వైసీపీ సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. అయితే రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత అధికారులు పవన్ కు రైతులతో ముఖాముఖి కార్యక్రమానికి అనుమతి ఇచ్చినట్టు తెలుస్తోంది. ఉదయం పదకొండున్నర తర్వాత కార్యక్రమం నిర్వహించుకోవాలని సూచించినట్టు తెలుస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: