జనసేన పార్టీ బీజేపీ పార్టీలో వీలీనం అవుతుందంటూ కొద్ది రోజులుగా రాష్ట్రమంతటా చర్చ జరుగుతోంది. అమిత్ షా పై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ గొప్ప నాయకుడు అని పొగిడారు. ఇక ఆ మధ్య ఒక బహిరంగ సభలో "వైసీపీ ఎమ్యెల్యేలు ఎంత, నా రెండు చిటికలంత" అంటూ కామెంట్స్ చేశారు పవన్ దీనితో బీజేపీ మద్దతు లేకుండా పవన్ ఇలా మాట్లాడరు అని వైసీపీ నేతలు అంటున్నారు. 

 

తాజాగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని బీజేపీలోకి వీలీనం చెయ్యడానికి కొత్త సంకేతాలు ఇచ్చారని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి "నిన్న తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ ఎప్పుడూ లేని విధంగా కాషాయం కండువా ధరించారు, సాధారణంగా తిరుమల శ్రీవారి దర్శనానికి పవన్ ఎప్పుడు వచ్చిన తెల్ల పంచ, తెల్ల కండువాతోనే వస్తారు కానీ నిన్న మాత్రం పవన్ కాషాయ కండువా తో కనిపించారు"

 

జనసేనను బీజేపీలో వీలీనం చేస్తున్నట్లు శ్రీవారి సాక్షిగా పవన్ సంకేతాలు ఇచ్చినట్లు ప్రత్యర్థి పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదే జరిగితే గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో వీలీనం చేసిన అన్నయ్య బాటలోనే తమ్ముడు పవన్ కళ్యాణ్ నడిచినట్లు అవుతుంది. జనసేన పార్టీ వర్గాలు మాత్రం తమ పార్టీ బీజేపీలో వీలీనం అవుతుందంటూ వచ్చిన వార్తలని ఖండించారు. 

 

ఒకవేళ జనసేన బీజేపీలో వీలీనం అయితే, పవన్ కు ఏపీ బీజేపీ పగ్గాలు అప్పగిస్తే రాజకీయంగా బీజేపీ కి ఏపీ లో కలిసిరావడం ఖాయంగా కనిపిస్తోంది. ఏపీ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ కనీసం ఒక్కటంటే ఒక్క ఎంపీ సీట్ ను కూడా గెలవలేకపోయింది. దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న మొత్తం 84 ఎంపీ సీట్లలో సగం సీట్లైన ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని బీజేపీ భావిస్తోంది ఈ నేపథ్యంలో పవన్ తమకు మంచి అస్త్రంలా ఉపయోగపడతారు అని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: