ప్రేమ ఎంత మధురం.. నిజమే.. ఆ మధురమైన ప్రేమ కోసం ఎంతదూరమైనా వెళ్లేందుకు సిద్దపడుతుంటారు.  ప్రేమ విషయంలో మనిషి ఎంత కష్టమైనా ఓర్చుకుంటాడు.  ఎంత దూరం వెళ్లేందుకైనా రెడీ అంటాడు.  ఎన్ని విపత్కర పరిస్థితులు ఎదురైనా సరే వాటిని అడ్డగించి గెలిచి చివరకు అనుకున్నది సాధించుకుంటాడు.  అదే ప్రేమంటే..నిజమైన ప్రేమ ఉన్నప్పుడు ఆ ప్రేమ మనిషిని ఎంతదూరమైనా తీసుకెళ్లేలా చేస్తుంది.  ఎన్ని అడ్డంకులు ఎదుర్కొనేలా కూడా చేస్తుంది.  


ఇందులో ప్రేమ కోసం ఎన్ని రాష్ట్రాలైన దాటొచ్చు.. ప్రేమ కోసం ఎన్ని దేశాలైన వెళ్లొచ్చు.  కానీ, పాక్ వెళ్లాలంటే మాత్రం కుదరదు.  ఎందుకంటే పాక్ ఇండియాకు శత్రుదేశం.  మన దగ్గర అన్ని ఉండి నిజంగా ఆ దేశం వెళ్ళాలి అనుకున్నాగాని వెళ్లేందుకు అనుమతి ఇవ్వరు.  అలాంటిది ప్రేమ కోసం అక్రమంగా పాక్ వెళ్ళాలి అంటే కుదరని పని కదా.  కానీ,  ఓ యువతి మాత్రం ధైర్యం చేసి పాక్ వెళ్ళింది.  


తన ప్రేమికుడిని చూసేందుకు, కలిసి మాట్లాడేందుకు పాక్ వెళ్లాలని నిర్ణయం తీసుకుంది.  హర్యానాలోని ఖైదల్ జిల్లా నుంచి తన ప్రియుడిని కలుసుకోవడానికి కర్తార్ పూర్ కారిడార్ ను వినియోగించుకోవాలని అనుకుంది. దానికోసం ప్లాన్ వేసింది.  నకిలీ ఐడిని తీసుకొని అక్కడి నుంచి బయలుదేరి కర్తార్ పూర్ కారిడార్ మీదుగా పాక్ వెళ్ళింది.  అయితే, అక్కడ పాక్ రేంజర్లు ఆమెను పట్టుకున్నారు.  


ఆమెను ప్రశ్నించగా ఆమె చెప్పిన విషయాలు విని షాక్ అయ్యారు.  తన ప్రియుడిని కలుసుకోవడనికి వచ్చినట్టు చెప్పింది.  తన ప్రియుడికోసం ఇంతదూరం వచ్చినట్టుగా చెప్పింది.  ఎలాగైనా సరే తనకు చూడాలని చెప్పింది.  కానీ, పాక్ రేంజర్లు అందుకు ఒప్పుకోలేదు.  నకిలీ ఐడితో వస్తున్న ఆమెను అవసరమైతే పాక్ అధికారులు అరెస్ట్ చెయ్యొచ్చు.  కానీ, ఆమెలోని నిజాయితీ ప్రేమకు వాళ్ళు కూడా కరిగిపోయారు.  కానీ, పరిస్థితులు అనుమతించవు కాబట్టి ఆమెను తిరిగి వెనక్కి పంపించేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: