దిశ హత్య కేసు కీలక మలుపు తిరిగింది. తెలంగాణ ప్రభుత్వం చొరవతో హైకోర్టు దిశ హత్య కేసును విచారించడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మహబూబ్‌నగర్‌ మొదటి అదనపు సెషన్స్‌ జిల్లా జడ్జి కోర్టును ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టుగా పరిగణిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.

 

ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు సాధారణ కోర్టుకు తేడాలివే

 

ఏదైన దారుణమైన ఘటన జరిగితే నిందితులకు సత్వరం శిక్ష పడాలని భావిస్తే ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేస్తారు. ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టు కూడా న్యాయశాస్త్రానికి లోబడే పనిచేస్తుంది దీనికంటూ ప్రత్యేక న్యాయశాస్త్రమంటూ ఉండదు. సాధారణ కోర్టుల్లాగా ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు వందల సంఖ్యలో కేసులు ఉండవు. ఫాస్ట్ ట్రాక్ ఏక కాలంలో ఒకే ఒక్క కేసు ను విచారిస్తుంది అంటే ప్రస్తుతం దిశ హత్య కేసు విచారణకు ఏర్పాటు చేసిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు దిశ హత్య కేసు ను మాత్రమే విచారిస్తుంది ఇంకే కేసును విచారించదు. వాయిదాలు లేకుండా నిందితులని ప్రతీ రోజు కోర్టుకు పిలిచి విచారణ జరిపి అతి కొద్ది రోజుల్లోనే నిందితులకు శిక్ష విదిస్తుంది ఫాస్ట్ ట్రాక్ కోర్టు. 

 

దిశ హత్య కేసులో తీర్పు 23 రోజుల్లోనే రానుందా? 

 

నిందితులకు అతి తొందరగా శిక్ష పడాలంటే పోలీసులు ఛార్జీషీటును ఎంత తొందరగా వేస్తే అంత తొందరగా శిక్ష పడనుంది. గతంలో వరంగల్ జిల్లాలో చిన్నారిపై దారుణానికి పాల్పడ్డ మృగాడికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు 56 రోజుల్లో శిక్ష ఖరారు చేసింది. ఈ కేసులో పోలీసులు చార్జిషీట్ వెయ్యడానికి దాదాపు నెల రోజుల సమయంలో తీసుకోగా చార్జిషీట్ వేసిన అనంతరం కేవలం 23 రోజుల్లోనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీర్పు వెలువరించింది. ఇక అ కేసులో కూడా పోలీసులు చార్జిషీట్ వెయ్యడానికి ఎంత తక్కువ సమయం తీసుకుంటే అంతే తొందరగా నిందితులకు శిక్ష పడనుంది. కావున నిందితులకు కేవలం నెలరోజుల్లోపే శిక్ష పడనుంది, 23 రోజుల్లో శిక్ష పడినా అతిశయోక్తి లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: