ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజల్లో సానుకూల అభిప్రాయం ఇప్పటికే ఏర్పడింది. ఆర్ధికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే జగన్ సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేయడం, ప్రతీ ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళడం ఆయన చేస్తున్నారు. ఇచ్చిన ప్రతీ హామీని కూడా అమలు చేసే విధంగా జగన్ అడుగులు వేస్తున్నారు. ప్రతీ సంక్షేమ కార్యక్రమానికి లక్ష్యాన్ని పెట్టుకుని మరీ ఆయన అమలు చేస్తున్నారు.

 

గత ప్రభుత్వం ఇచ్చిన అప్పులను కట్టుకుంటూ, ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఇదే సంచలనంగా మారింది. జాతీయ స్థాయిలో దీనిపై చర్చ జరుగుతుంది. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా వైసీపీ ఎంపీలను.. బీహార్ ఉత్తరప్రదేశ్ బిజెపి ఎంపీలు కొందరు కలిసారట... రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాల గురించి కొన్ని వివరాలు అడిగారట, ముఖ్యంగా రైతు భరోసా, వాహన మిత్ర పథకం గురించి వివరాలు అడిగారట.

 

అలాగే నవరత్నాలకు సంబంధించిన వివరాలను కూడా అడిగారట బిజెపి ఎంపీలు. కొందరు ఎంపీలు నవరత్నాలకు సంబంధించి, రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డిని అడిగి తెలుసుకునే ప్రయత్నాలు చేసారట. ఇప్పుడు పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో దీనిపై చర్చ జరుగుతుంది. ఆదాయం లేక కేంద్ర ప్రభుత్వ నిధులు లేక ఏ విధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారట.

 

అలాగే పోలవరం నిర్మాణం విషయంలో ప్రభుత్వం దూకుడు, రాష్ట్ర రాజధాని అమరావతి విషయంలో చర్చలు ఇప్పుడు పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఏది ఎలా ఉన్న జగన్ నవరత్నాలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హైలెట్ అయ్యాయి. ఇక ఇత‌ర రాష్ట్రాల‌కు చెందిన మంత్రులు, ఐఏఎస్ అధికారులు సైతం ఆంధ్రా కు వ‌చ్చి ఇక్క‌డ ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు ఎలా ?  ఉందో ప‌రిశీలించి మ‌రీ వెళుతున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: