మూడున్నరేళ్ల తరువాత తెలంగాణ రాష్ట్రంలో బస్సు చార్జీలు పెరిగాయి. ఆర్టీసీ యాజమాన్యం వస్తు సేవల పన్ను భారం కావడం, రాష్ట్ర ఆర్టీసీ ఆదాయం తగ్గిపోవడంతో చార్జీలు పెంచక తప్పలేదు. తెలంగాణ ప్రభుత్వం కిలో మీటర్ కు 20 పైసల చొప్పున చార్జీలను పెంచింది. టికెట్ల ధరల పెంపు వలన 1000 కోట్ల రూపాయల ఆదాయం పెరుగుతుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తుంది. 
 
తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ చార్జీలు పెరగడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఆర్టీసీ చార్జీలు పెరిగే దిశగా అడుగులు పడుతున్నాయని తెలుస్తోంది. 1000 కోట్ల రూపాయలకు పైగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్టీసీకి నష్టాలు వస్తున్నాయి. ఏపీలో ఆర్టీసీ డీజిల్ ధరలు భారీగా పెరగటంతో చార్జీలు పెంచాలని ఎన్నికల ముందు ప్రభుత్వాన్ని కోరినా ఎన్నికలు ఉండటంతో ప్రభుత్వం అందుకు అంగీకరించలేదు. 
 
ఆర్టీసీకి సరుకు రవాణా ద్వారా ఆదాయం వస్తున్నా నష్టాలు మాత్రం తప్పడం లేదు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం దిశగా అడుగులు పడుతున్నాయి. 2020 సంవత్సరం జనవరి నెల నుండి ఏపీలో ప్రభుత్వమే ఆర్టీసీ కార్మికులకు జీతాలు చెల్లించబోతుంది. తెలంగాణలో ఆర్టీసీ చార్జీలు పెరగటంతో ఆంధ్రప్రదేశ్ లో కూడా చార్జీలు పెంచాలని ప్రతిపాదనలు చేసినట్లు తెలుస్తోంది. 
 
ప్రభుత్వం ప్రత్యేక కమిషన్ ను ఆర్టీసీ, ప్రైవేటు బస్సు చార్జీల నియంత్రణ కోసం నియమించాలని నిర్ణయించిందని తెలుస్తోంది. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ప్రత్యేక కమిషన్ కు సంబంధించిన బిల్లును ఆమోదించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆర్టీసీ ఎండీ ప్రస్తుతం చార్జీల పెంపు ప్రతిపాదన లేదని చెబుతున్నప్పటికీ అతి త్వరలోనే చార్జీలు పెరగబోతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ చార్జీలు పెరగటంతో తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్ రూట్లలో ప్రయాణించే తెలంగాణ రాష్ట్ర బస్సుల చార్జీలు పెరగగా ఆంధ్రప్రదేశ్ బస్సుల చార్జీలు మాత్రం తక్కువగా ఉన్నాయి. అందువలన ప్రయాణికులు తెలంగాణ రాష్ట్ర బస్సుల కంటే ఏపీ బస్సులలోనే ప్రయాణం చేయటానికి మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది. 

 
 

మరింత సమాచారం తెలుసుకోండి: