రాష్ట్రంలో నిరుద్యోగులు ఉద్యోగాలు ఎప్పుడు ఎప్పుడు వస్తాయి అని ఎదురు చూసేవారు. అలాంటివారి కోసమే అన్నట్టు జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు నెలల్లో  లోపలనే గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయం అంటూ ఉద్యోగాలను ఇచ్చారు. కానీ, ఇప్పుడు వీటి పనితనం మీద ప్రశ్నలు మొదలయ్యాయి. చాలా మంది సచివాలయ ఉద్యోగులు రెండు నెలలు కష్టపడితే పర్మినెంట్ అవుతుందన్న ఆశతో పీజీలు, పీహెచ్ డీలు కూడా చదివిన వారు కూడా వీటి కోసం కష్టపడ్డారు.

 

ఉద్యోగాల్లో అర్హులైన వాళ్ళు అందరూ కూడా విధుల్లో చేరి పోయారు. రాష్ట్రంలో అన్ని చోట్ల ఉద్యోగాలు సాధించిన  అందరూ కూడా విధులకు హాజరు అవుతున్నారు. కానీ, తిరుపతిలో ఒక భిన్నమైన పరిస్థితి ఎదుర్కొన్నారు . 
విధుల్లో చేరిన 38 మంది నగర పాలక సంస్థకు చెందిన గ్రామ సచివాలయ ఉద్యోగులు వారి పై అధికారులు ప్రవర్తిస్తున్న తీరు తో తమకు ఉద్యోగాలు వద్దంటూ రాజీనామాలు సమర్పించి వెనక్కి వెళ్లి పోతున్నారు. ఉద్యోగంలో చేరిన తర్వాత తొలి జీతమైనా పొందకుండానే వారు ఈ నిర్ణయం తీసుకోవడం అధికారులలో చర్చనీయాంశం అయింది.

 

తిరుపతి నగరపాలక పరిధిలో మొత్తం 1006 వార్డు సచివాలయ ఉద్యోగులని కేటాయించింది. కానీ అర్హులైన 736 మందిని ఆరు దశల్లో కౌన్సిలింగ్ తర్వాత తిరుపతి నగరానికి కేటాయించారు. అక్టోబర్ 2న ఉద్యోగంలో చేరిన వీరికి ఇంకా తొలి జీవితం కూడా అందలేదు. కొందరేమో ఇంకా మంచి ఉద్యోగం కోసం చదువుకోవాలన్న కారణాలు చెప్తూ రాజీనామాలు చేశారు. కానీ అసలు విషయం వేరే ఉంది అని అందరికీ తెలుస్తుంది. దీనికి అసలు కారణం ఏమంటే పని ఒత్తిడి ఎక్కువ ఉండటం వల్ల, అలాగే పై అధికారులు తీరు సరిగా లేదని కారణాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

 

వారు ఉద్యోగంలో చేరిన తర్వాత సరైన శిక్షణ, అధికారుల సహకారం లేకపోవడంతో, సమావేశంలో అధికారులు తీరును, ఉన్నత విద్యాభ్యాసం చేసి ఇప్పటికే ఉన్నత స్థాయి ఉద్యోగం చేసిన కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు.  ఇటువంటి ఉద్యోగులను మాట్లాడుతూ నగరపాలక కమిషనర్ మాత్రం చాలా మంచివారని వాళ్ళు చెబుతున్నారు. కమిషనర్ గారు మీరు మీ కుటుంబాలకు తగిన సమయం కేటాయించాలని ఆయన పదే పదే చెప్పేవారు అని ఉద్యోగులు చెబుతున్నారు. ఏది ఏమైనా ఉద్యోగంలో చేరిన వెంటనే ఇలా రాజీనామాలు చేయడం ప్రభుత్వానికి మంచి సూచన కాదు అని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: