ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు సమయం దగ్గరపడుతుంది. సోమవారం నుంచి సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో విపక్ష తెలుగుదేశం పార్టీ అధికార పక్షాన్ని ఏ విధంగా ఇరుకున పెట్టాలి అనే దాని మీద కసరత్తు చేస్తుంది. ఇసుక సమస్య, రాజధాని అంశం, ప్రభుత్వ భూములు అమ్మడం, ఇంగ్లీష్ మీడియం వంటి నిర్ణయాలను లక్ష్యంగా చేసుకుని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టె విధంగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే దీని మీద పూర్తి స్థాయిలో సమాచారం కూడా తెలుగుదేశం పార్టీ సేకరించింది.

 

మరి తమను ఇరుకున పెడితే అధికార వైసీపీ ఏ విధంగా ముందుకి వెళ్తుంది అనేది... ఆసక్తికరంగా మారింది. ఇసుక సమస్య గురించి ఇప్పటికే మంత్రులు యేవో కబుర్లు మీడియా ముందు చెప్పారు. ఆ కబుర్లు మళ్ళీ అసెంబ్లీ సమావేశంలో అర్ధం లేకుండా చెప్పాలని వైసీపీ భావిస్తుంది. ఇక గట్టిగా మాట్లాడితే ఎదురు దాడికి కూడా వైసీపీ దిగే అవకాశం ఉంది. ఇక రాజధాని అంశంలో... చంద్రబాబు పర్యటన చేస్తున్నారని తెలుసుకుని సమావేశం పెట్టి ఆపొద్దని జగన్ చెప్పారు. దీనిని తమకు అనుకూలంగా మార్చుకునే క్రమంలో రైతుల నిరసన గురించి మాట్లాడి, విమర్శలు చెయ్యాలని భావిస్తుంది వైసేపీ ప్రభుత్వం.

 

ఇక ప్రభుత్వ భూములను ఎందుకు అమ్ముతున్నారు అంటే అప్పులు చేసి పోయారు కాబట్టి అమ్ముతున్నామనే ప్రధాన సమాధానం చెప్పాలని అధికార పార్టీ భావిస్తుంది. ఎందుకంటే టీడీపీ ప్ర‌ధానంగా అటు ఇంగ్లీష్ మీడియం తో పాటు ఇటు భూముల అమ్మ‌కాల విష‌యాన్నే ప్ర‌ధాన అస్త్రంగా చేసుకుని వైసీపీని ఇరుకున పెట్టాల‌ని చూస్తుండ‌డంతో ఈ రెండిటిక్ జ‌గ‌న్ మార్క్ కౌంట‌ర్ రెడీ చేసుకున్నార‌ట‌. ఇంగ్లీష్ మీడియం విషయంలో వ్యక్తిగత ఆరోపణలకు వైసీపీ దిగింది. ఇప్పుడు వాటినే మరోసారి చేసే అవకాశం కూడా ఉందని అంటున్నారు. ఇక ఎవరైనా ఎమ్మెల్యేలు గట్టిగా తమ స్వరం వినిపిస్తే సస్పెండ్ చెయ్యాలని కూడా భావిస్తుంది వైసీపీ. ఇప్పటికే అసెంబ్లీ సమావేశాల మీద జనానికి ఒక స్పష్టత కూడా వచ్చి౦ది. 

మరింత సమాచారం తెలుసుకోండి: