ఎప్పటిలాగే ఆరోజు కూడా తన ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించడానికి దిశ ఇంటి నుండి బయలు దేరుతూ అమ్మా వెళ్లోస్తాను. ఈ రోజు కాస్త లేటవుతుందేమో మీరు కంగారు పడకండి. ఎందుకంటే నేను వైద్యం చేస్తున్నది మూగజీవాలకు. అవేమి చేయవు నన్ను. ఇలా అన్న ఆ బిడ్దను ఆ తల్లి దగ్గరగా పిలుచుకుని అమ్మ అవి నాలుగు కాళ్ల జంతువులమ్మా అవి స్వచ్చమైన తల్లిపాలు తాగి పెరిగాయి. కాని లోకంలో రెండు కాళ్ల జంతువులు తిరుగుతున్నాయి. వీటితోనే తల్లి ఉన్న ప్రమాదం అంతా. నువ్వో అమాయకపు పిల్లవు. నిద్దర్లో కూడ భయమేస్తే అమ్మా అని అరచి కరుచుకుని పడుకుంటావు.

 

 

పిచ్చిపిల్లవు నేను దేవుని దగ్గరకు వెళ్లితే ఎలా బతుకుతావో అనుకుంటూ కన్నీళ్లు కార్చింది. కాని ఆక్షణం ఆ తల్లి హృదయానికి ఏం తెలుసు తనకంటే ముందే తన బిడ్డకు నూరేళ్లు నిండుతాయని. వెళ్లోస్తానని వెళ్లే తన బిడ్డ ఇక రాదని. ఎందుకంటే లోకంలో తల్లి పాల రుచి మరచిన మృగాలు రక్తాన్ని పీల్చుకోవడానికి అలవాటుపడ్డాయని. పాలకులు పదవులకోసమే తప్పా ప్రజల కోసం కాదని. చెల్లి అంటూనే పైటచాటు అందాలను పాపపు కళ్ళతో చూసే నికృష్టపు వెదవలు ఉన్నారని. పాపం ఇవేమి తెలియని అమాయకపు తల్లి.. ఆనందంగా తల్లి చెప్పిన మాటలు విని అమ్మా అనవసరంగా నువ్వు భయపడుతున్నావు. నేనుండేది పశువులతో అమ్మా, మృగాలతో కాదు. అవి నన్నేమి చేయవు అమ్మా అని సమాదానమిచ్చింది దిశ.

 

 

కాని తనకేమి తెలుసు అసలు వైద్యం చేయవలసింది రెండు కాళ్ల పశువులకే అని. ఇవేమి అర్దం కాని దిశ ఆనందంగా బై బై అని చెప్పి ఇంట్లోనుండి వెళ్లిపోయింది అంతే మళ్లీ కడసారి చూపుకు కూడ నోచుకోలేదు.. కాని ఆ తల్లి ఇప్పుడు రోదిస్తుంది. తన బిడ్డకు ఉన్నతమైన చదువులు చెప్పించాము కాని సమాజంలో బ్రతడం నేర్పించలేదని పగిలిన హృదయంతో రోదిస్తుంది. ఇప్పుడు మగవాళ్లనే కాదు మగపశువులను కూడా దగ్గరకు రానీయకండని ప్రతి ఆడపిల్లకు చెబుతుంది.

 

 

ఎందుకంటే చిన్నప్పటి నుండి కొంగుపట్టుకుని తిరిగిన పిల్ల ఆకలైతే ఆగలేక అమ్మా అని కేకలేసిన పిల్ల ఆ నికృష్టపు వెదవలు చేస్తున్న అరాచకం సమయంలో ఎన్ని సార్లూ అమ్మా అమ్మా అని అరచిందో పాపిష్టిదాన్ని ఆ పిలుపు వినకుండా నాపనిలో నేనున్నాను అని దయనీయంగా కన్నీళ్లూ పెడుతున్న ఆ తల్లికి న్యాయం జరిగేది ఎప్పుడో. ఇలాంటి అన్యాయాలు ఆగేది ఎప్పుడో. పైకి నవ్వుతున్నట్లుగా నటిస్తున్న తోడేళ్లను అసలే నమ్మకండని చెప్పాలని ఉన్న ఆ తల్లి గొంతు ఇప్పుడు మూగబోయింది.. ఆమె వేదన భరమాతకు తప్ప ఎవరికి అర్ధం కాదు..

మరింత సమాచారం తెలుసుకోండి: