ఇలాగైపోయింది చంద్రబాబునాయుడు పరిస్దితి. అధికారంలో ఉన్న ఐదేళ్లు రాజధాని నిర్మాణం పేరుతో గ్రాఫిక్స్ తో జనాలను నిండా ముంచేసిన చంద్రబాబు ప్రతిపక్షంలోకి రాగానే అమరావతి నిర్మాణం పేరుతో రౌండ్ టేబుల్ సమావేశం పెడుతున్నారు. తన అధ్యక్షతన జరగబోతున్న సమావేశానికి అందరూ రావాలంటూ వివిధ పార్టీల నేతలను పదే పదే ఆహ్వానిస్తున్నారు.

 

విజయవాడలో మధ్యాహ్నం జరగనున్న రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనాలంటూ పార్టీల నేతలను  బ్రతిమలాడుకుంటున్నారనే చెప్పాలి. ఎందుకంటే గతంలో చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన రెండు సమావేశాలకు నేతలు పెద్దగా హాజరుకాలేదు. కేవలం జనసేన, ప్రజాసంఘాల నుండి మాత్రమే నేతలు హాజరవ్వటంతో పరువు పోయింది. అందుకనే ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి మాత్రం వీలైనంతమంది నేతలు హాజరయ్యేట్లు చూడాలని టిడిపి నేతలు పట్టుదలగా ఉన్నారు.

 

నిజానికి రాజధానిపై చంద్రబాబు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించటమే విచిత్రంగా ఉంది. రాజధాని ముసుగులో ఎంత అవినీతికి పాల్పడాలో అంతా చేశారు. రాజధాని నిర్మాణం పేరుతో  రైతులను వ్యవసాయం చేసుకోనీయలేదు. పోనీ నిర్మాణాలన్నా చేశారా అంటే అదీ లేదు. మూడు తాత్కాలిక నాసిరకం నిర్మాణాలు చేసి వదిలేశారు. దాంతో రైతుల నోట్లో మట్టి కొట్టినట్లైంది. అందుకనే రైతులంతా మొన్నటి ఎన్నికల్లో టిడిపి అభ్యర్ధులకు వ్యతిరేకంగా ఓట్లేశారు.

 

అమరావతిని ఎంపిక చేయటానికి ముందే  ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడి పెద్ద ఎత్తున వందలాది ఎకరాలను కారు చౌకగా కొట్టేశారు. చాలామంది టిడిపి నేతలు వందల ఎకరాలను రాజధాని ప్రాంతంలో ఈ పద్దతిలోనే కొన్నారని వైసిపి నేతలు ఆరోపణలు అందరూ వింటూనే ఉన్నారు. రాజధాని నిర్మాణం పేరుతో ఐదేళ్ళు విన్యాసాలు చేసి దెబ్బకొట్టిన చంద్రబాబు ఇపుడు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తుండటమే ఆశ్చర్యంగా ఉంది.

 

అప్పట్లో రాజధాని నిర్మాణంపై అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించమని ప్రతిపక్షాలు అడిగితే అవసరం లేదు పొమ్మన్నారు. మరిపుడు ఏ మొహం పెట్టుకుని రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నారు ?

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: