మనుషుల్లో తెలివి మీరింది. దీంతోపాటే టెక్నాలజీ పెరిగింది. కాని మాయ కమ్మింది. ఇప్పుడున్న టెక్నాలజీని సరైన మార్గంలో ఉపయోగించుకోకుండా ఇతరులను వంచించడానికి, పాడు పనులను చేయడానికి ఉపయోగిస్తున్నాడు. ఇకపోతే ఇంటర్నెట్ వినియోగంతో ప్రతివారికి ఎన్నో కొత్తకొత్త విషయాలు తెలుసుకునే అవకాశం ఉంది కాని నట్టింట్లోకి వచ్చేసిన ఇంటర్నెట్ లో అడ్దమైన వీడియోలు చూస్తూ వాటికి బానిసలుగా మారి సమాజానికి కీడు తలపెడుతున్నారు.

 

 

ఇకపోతే ఇలాంటి వారి ఆట కట్టించేందుకు చెన్నై పోలీసులు కఠినచర్యలు తీసుకోనున్నారు. పోర్నోగ్రఫీ కట్టడిపై ఉక్కు పాదం మోపనున్నారు.. ఇప్పటికే అనేక పోర్న్ వెబ్‌సైట్లను గతంలో కేంద్రం బ్యాన్ చేసినా కొత్త పేర్లతో ఆ సైట్లు దర్శనమిస్తున్నాయి. దీంతో వాటిని నివారించడంతో పోలీసులకు సాధ్యం కావడం లేదు.

 

 

ముఖ్యంగా చెన్నైలో పోర్న్ వీడియోలు చూస్తున్న వారి సంఖ్య నానాటికీ పెరిగిపోవడంతో కొత్త సమస్యలు వస్తున్నాయి. దీని కారణంగా మహిళలపై దాడులు పెరిగే అవకావముందని పోలీసులు భావిస్తున్నారు. దీంతో పోర్న్ వీడియోలు చూసేవారిపై కఠినచర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.

 

 

ఇకపోతే ఇప్పటి నుండి చిన్నారుల పోర్న్ వీడియోలు చూసినా, డౌన్‌లోడ్ చేసినా, వాటిని ఇతరులకు షేర్ చేసినా వారికి అరెస్ట్ తప్పదని తమిళనాడు అడిషనల్ డీజీపీ రవి బుధవారం హెచ్చరించారు. అసలు విషయం ఏంటంటే ఓ సర్వేలో చెన్నై పోర్న్ వీడియోలు చూసేవారిలో మొదటి స్థానంలో ఉన్నట్లు తేలిందని చెప్పారు.

 

 

ఇక ఇప్పటికే చైల్డ్ పోర్న్ వీడియోలు, ఫొటోలు చూసి, డౌన్‌లోడ్‌ చేసే వ్యక్తుల సెల్‌ఫోన్‌, కంప్యూటర్‌ ఐపీ అడ్రస్‌‌లను కేంద్ర ప్రభుత్వం తమకు పంపిందని, వాటి ఆధారంగా ఆయా వ్యక్తులను త్వరలోనే అరెస్ట్ చేస్తామన్నారు.

 

ఇక ఈ సందర్భంగా డీజీపీ చైల్డ్ పోర్న్ వీడియోలు చూసేవారికి 3-7 ఏళ్ల వరకు జైలుశిక్ష పడుతుందని పేర్కొన్నారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: