యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన బాహుబలి సిరీస్ భారతదేశంతో సహా ప్రపంచం వ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. హిందీ ప్రేక్షకులను కూడా ఫిదా చేసి వారి మనసుని దోచేసుకున్న ఏకైక రీజినల్ సినిమాగా ప్రఖ్యాత పొందింది. తెలుగు చిత్ర పరిశ్రమ యొక్క ఖ్యాతిని... రాజమౌళి బాహుబలి సినిమా ద్వారా మెచ్చుకోదగ్గ లెవల్ కు తీసుకెళ్ళాడు. 'కట్టప్ప బాహుబలి ని ఎందుకు చంపాడు?' అనే ఆసక్తికరమైన అంశంతో తెరకెక్కిన 'బాహుబలి(ద కంక్లూజన్)' భారతదేశ సినీ చరిత్రలోని రికార్డులు అన్నీ బద్దలు కొట్టింది. ఇంతవరకు సినిమా చరిత్రలో బాహుబలి రికార్డులు చెక్కుచెదర లేదని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సినీ విమర్శకులను సైతం మెప్పించిన మొట్టమొదటి సినిమా బాహుబలి.


ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే... ఇంత గొప్పగా బ్లాక్ బస్టర్ అయిన మన తెలుగు సినిమాకి... యాహు ఇండియా అనే ప్రఖ్యాత సంస్థ ఈ దశాబ్దంలో వచ్చిన 10 హిట్ సినిమాల్లో బాహుబలికి ఎటువంటి ప్లేస్ ఇవ్వలేదు. దీంతో దిగ్గజ దర్శకుడు రాజమౌళికి, బ్రిలియంట్ యాక్టర్ ప్రభాస్ కు అవమానం జరిగిందంటూ... మన తెలుగు ప్రజలు ఎంతో నిరాశ చూపిస్తున్నారు. బాలీవుడ్ సినిమా ట్రేడ్ అనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ చెప్పిన ప్రకారం... బాహుబలి విడుదలైన 10 రోజుల్లో కేవలం హిందీలోనే 300 కోట్ల రూపాయలు బాక్సాఫీస్ దగ్గర వసూలు చేసింది. నిజానికి ఏ సినిమా భారతదేశ చిత్ర పరిశ్రమలో... 10 రోజుల్లో రూ.200 కోట్లను దాటలేదు.

అయితే యాహూ ఇండియా పై నెటిజన్లు ఇలా స్పందిస్తున్నారు... 'మన తెలుగు సినిమా బాహుబలి స్థాయి ఎక్కడా... చక్కని కథలేని హిందీ సినిమాల స్థాయి ఎక్కడా ... ఎంతో ప్రతిష్టాత్మకంగా బాహుబలిని తెరకెక్కించిన రాజమౌళి చిత్రాన్ని ప్రతి ఒక్కరు మెచ్చుకోకుండా ఉండలేరు. అటువంటి సినిమాని పక్కన పెట్టడం ఎంతవరకు సమంజసం' అంటూ యాహు ని విమర్శిస్తూ... సినీ ప్రియులు ఎంతో నిరాశతో దిగులు చెందుతున్నారు.

ఇకపోతే... బాలీవుడ్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ నటించిన దంగల్ అనే సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఆప్ డికేడ్‌గా యాహూ నిర్ణయించింది.  ఏ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 2000 కోట్ల కలెక్షన్ సాధించింది. అయితే ఈ సినిమా చైనాలో విడుదల అవడం వలన  ఎక్కువ కోట్లు వచ్చాయని ప్రముఖులు చెబుతున్నారు. కానీీ బాహుబలి కేవలం ఇండియా, ఓవర్సీస్లో కలిపి 1800 కోట్ల రూపాయలను బాక్స్ ఆఫీస్ వద్ద సంపాదించింది. యాహూ ఇండియా ఏ ప్రాతిపదికన బాహుబలిని ఎంపిక చేయలేదో చెబితే బాగుంటుందిని అందరు చెప్పుకుంటున్నారు. గతంలో యూస్ సిటిజెన్ అయిన భారతదేశ మహిళ... అసలు సిసలైన భారతీయ నటులతో తీసిన 'కేరాఫ్ కంచరపాలెం' సినిమాను నేషనల్ ఫిలిమ్స్ అవార్డుకు ఎంపిక కూడా చేయలేదు. దీంతో మన తెలుగు సినిమాలంటే వీళ్ళకి లెక్క లేదా అంటూ నెటిజన్లు బాగా మండిపడుతున్నారు.





మరింత సమాచారం తెలుసుకోండి: