చిన్నాన్న అంటే తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడు.. అలాంటి తండ్రి స్థానంలో ఉన్న అతను వావి వరుసలు కూడా మరచి చిన్నారి పై తన కామ వాంఛలు తీర్చుకున్నాడు.. బయట మాట అటుంచి ఇంట్లోనే రక్షణ లేకుంటే ఇంకా ఆడపిల్లలు ఎలా బ్రతుకుతారు.. ఆడ అనే మాట ఏడా కనిపించకుండా పోతారేమో అని అనిపిస్తుంది.. చిన్నారిని కూడా వదలకుండా నరకాన్ని చూపించాడు.. 

 

వివరాల్లోకి వెళ్ళితే.. ఈ ఘటన సూర్యాపేటకు చెందిన ఓ మహిళకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె. భర్త పదేళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోవడంతో కూలిపనులు చేసుకుంటూ పిల్లలను పోషిస్తోంది. ఈ క్రమంలోనే కొన్నేళ్ల క్రితం మరో వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుంది.చదువు మానేసి ఇంటి వద్దే ఉంటూ అప్పుడప్పుతూ తల్లితో కలిసి కూలిపనులకు వెళ్తుంటుంది. అయితే బాలికపై కన్నేసిన మారుతండ్రి తరుచూ కోరిక తీర్చాలంటూ వేధిస్తున్నాడు. 

 


ఆలా ఒప్పుకొని పక్షంలో కుటుంబం లోని  అందరినీ చంపేస్తానని బెదిరిస్తున్నాడు. ఈ నెల ఒకటో తేదీన తల్లి కూలిపనులకు వెళ్లిన సమయంలో బాలికను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక గట్టిగా ఏడవడంతో ఇకపై ఇలాంటి పని చేయనని, తల్లికి చెప్పొద్దని ఆ కామాంధుడు వేడుకున్నాడు. దీంతో బాధితురాలు ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు.అలా అదునుగా చూసుకున్న ఆ కామాందుడు పలు మార్లు రేప్ చేసి నరకాన్ని చూపించాడు, 

 

బుధవారం ఉదయం తల్లి లేని సమయంలో మరోసారి బాలికపై ఆ నీచుడు అత్యాచారం చేయబోయాడు. దీంతో బాధితురాలు అతడి బారి నుంచి తప్పించుకుని స్నేహితురాలి ఇంటికి వెళ్లింది. సాయంత్రం ఇంటికి వచ్చిన తల్లికి జరిగిన విషయం చెప్పడంతో ఆమె సూర్యాపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు బుధవారం రాత్రి ఆ కామాంధుడిని అరెస్ట్ చేశారు. అతడిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఆడపిల్ల అంటే కామందుందుల కోరికలు తీర్చే బొమ్మలాగా మారింది.. ఆడదానికి కోపం వస్తె మగపురుగు కూడా భరతమాత ముందు తిరగడానికి ఉచ్చ పోయాల్సిందే.. ఓ ఆడపిల్ల మేలుకో మన శరీరాన్ని తాకే మగాడి రక్తాన్ని కల్లచూడక తప్పేలా లేదు .. నేడు దిశ నాడు ఇంకొకరి కామకొరికలకు బలి కాకుండా నిన్ను నువ్వు కాపాడుకో..

మరింత సమాచారం తెలుసుకోండి: