మనుషులకు ఎంత చెప్పిన అర్ధం కాదు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. ప్రాణాల మీదికి తెచ్చుకోవడమే కాదు ప్రక్కనున్న వారి ప్రాణాలు కూడా తీస్తారు. ఇలా నిర్లక్ష్యంగా బయటకు వచ్చే వారికి వాళ్ల తల్లి, చెళ్లి, కూతురూ, భార్య లాంటి వారు గుర్తుకు రారేమో. వీరి కోసం గుమ్మంలో నిల్చుని ఎదురు చూసే ఇలాంటి కుటుంబాలు చాలా ఉంటాయి. అందులో బస్సు, రైళ్లూ ప్రమాదాలకు గురైతే జరిగే నష్టం మాటల్లో చెప్పలేం. ఇకపోతే  అతి దారుణమైన రోడ్డు ప్రమాదం మధ్యప్రదేశ్‌లో గురువారం ఉదయం సంభవించింది.  

 

 

ప్రయివేట్ ట్రావెల్స్ బస్సు -లారీ ఢీ కొట్టిన ఘటనలో 15 మంది మృతి చెందారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఉదయం 6 గంటల ప్రాంతంలో రేవా జిల్లా కేంద్రానికి సమీపంలో చోటుచేసుకున్న ఈ ఘటన పరిసరాలను చూస్తే అత్యంతగా హృదయాన్ని కలిచివేసేలా కనిపిస్తుంది. ఇకపోతే గుధ్ జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ప్రధాన్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు బలంగా ఢీకొట్టింది. దీంతో బస్సులోని ప్రయాణికులు తీవ్రంగా గాయపడగా 10 మంది ఘటనా స్థలిలోనే మృతిచెందారు. మరో ఐదురుగు హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ప్రాణాలు వదలగా. మరికొందరు పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.  

 

 

ఇక ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం  డ్రైవర్ బస్సును వేగంగా నడిపిన ఆగి ఉన్న లారీని గమనించక పోవడంతోనే ప్రమాదం చోటుచేసుకుందని వారు వెల్లడించారు. ఇక బస్సులో చిక్కుకున్న బాధితుల ఆర్తనాదాలతో ఆ ప్రదేశం కకావికలంగా మారింది.. సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే స్పందించి క్షత్రగాత్రులను బయటకు తీయడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు.

 

 

ఇకపోతే చాలా మంది లోపలే చిక్కుకు పోవడం వల్ల క్రేన్ సాయంతో బస్సు-లారీని వేరుచేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదం పై స్పందించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించి, సహాయక చర్యల్లో పాల్గొన్నారు. క్షతగాత్రులను వైద్యం కోసం తరలించారు. ప్రమాదానికి కారణం అతివేగమే అని ప్రాథమికంగా నిర్ధరించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: