కేంద్ర ప్రభుత్వం రైతులకు నెలకు రూ 3000 చొప్పున పింఛన్ అందిస్తోంది. అరవై సంవత్సరాలు నిండిన రైతులు ఈ పథకానికి అర్హులు. 2019 నవంబర్ వరకు నరేంద్ర మోడీ ప్రారంభించిన ప్రధాన మంత్రి కిసాన్ మంధన్ యోజన కింద ఇప్పటివరకు 18 లక్షల మంది రైతులు నమోదు చేసుకున్నారు. 

 

లోకసభలో వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ లిఖితపూర్వక సమాధానంలో "కేంద్ర ప్రభుత్వ పథకం వృద్ధాప్యంలో ఉన్న చిన్న మరియు అట్టడుగు రైతులందరికీ సామాజిక భద్రతను అందిస్తుంది. 60 ఏళ్లు నిండిన తర్వాత రైతులకు కనీస నిర్దేశిత మొత్తం రూ .3000 పింఛన్ ఇస్తాం" అని తోమర్ తెలిపారు. పింఛనుదారుడి మరనిస్తే, జీవిత భాగస్వామికి 50 శాతం పెన్షన్‌ను కుటుంబ పెన్షన్‌గా పొందటానికి అర్హత ఉందని మంత్రి తెలిపారు. పెన్షన్ ఫండ్‌ను లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసి) నిర్వహిస్తుందని తోమర్ చెప్పారు.

 

పిఎమ్-కిసాన్ మంధన్ యోజన 18 - 40 సంవత్సరాల మధ్య వయస్సు గల రైతులకు సహాయకారిగా ఉంది. ఈ పథకం కింద నెలవారీ పింఛను రూ. అరవై ఏళ్లు నిండిన వారికి రూ 3000 చెల్లిస్తుంది ప్రభుత్వం. ఇందుకోసం 18-40 సంవత్సరాలు వయుస్సు ఉన్న రైతులు 60 సంవత్సరాల వయసు వచ్చే వరకు పెన్షన్ ఫండ్‌లో ప్రవేశించే వయస్సును బట్టి నెలవారీ రూ .55-200 చెల్లించాలి. 

 

పథకంలో చేరుటకు అర్హతలు ఇవే 

 

1. చిన్న మరియు సన్నకారు రైతులు సంబంధిత రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంత భూ రికార్డుల ప్రకారం రెండు హెక్టార్ల వరకు సాగు భూమిని కలిగి ఉన్నవారు.

2. 18 నుండి 40 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి.

3. రైతుకు ఆధార్ కార్డు మరియు సేవింగ్స్ బ్యాంక్ ఖాతా లేదా కిసాన్ ఖాతా ఉండాలి. 

 

రైతులు ఆన్‌లైన్ సెల్ఫ్ రిజిస్ట్రేషన్ ద్వారా లేదా వివిధ రాష్ట్రాల్లో లభించే కామన్ సర్వీస్ సెంటర్స్ (సిఎస్‌సి) ద్వారా ఈ పథకంలో చేరవచ్చు. ఎటువంటి ఖర్చు లేకుండా నమోదు చేసుకోవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: