ఇటీవల హైదరాబాద్ లోని షాద్ నగర్ ప్రాంతం వద్దగల తొండుపల్లి టోల్ గేట్ ఏరియాలో యువ వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్యోదంతాన్ని నిజంగా ఎప్పటికీ మరిచిపోలేము. ఆ అమ్మయిని ఎంతో ఘోరంగా అత్యాచారం చేయడంతో పాటు, ఆమెను అత్యంత కిరాతకంగా చంపేసి, ఆపై పెట్రోల్ పోసి దుండగులు తగులబెట్టిన ఈ దారుణ ఘటనపై దేశవ్యాప్తంగా ఉవ్వెత్తున నిరసన జ్వాలలు ఎగసిపడుతున్నాయి. ఇకపోతే ఈ ఘటనపై ప్రజా మరియు మహిళా సంఘాల వారు ప్రభుత్వాల పని తీరుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందరు నాయకులు మారినా, ఎన్ని కొత్త ప్రభుత్వాలు వచ్చినా ఆడవారికి మాత్రం సమాజంలో రక్షణ లేకుండాపోతోందని, 

 

ఇకనైనా మనం మేల్కొనకపోతే భవిష్యత్తులో ఆడవారిని కాపాడుకోలేము అంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఈ తాజా ఘటన తరువాత పోలీసులు ఆడవారి భద్రత విషయమై కొన్ని సరికొత్త చర్యలు కూడా తీసుకుంటున్నారు, అలానే వారితో పాటు తమ వంతుగా ఇకపై తమ ట్రైన్స్ లో ప్రయాణించే ఆడవారికి రక్షణ కల్పించే విధంగా ఒక సంచలన నిర్ణయం తీసుకుంది బెంగళూరు మెట్రో రైల్ విభాగం. ఇప్పటివరకు మెట్రో ట్రైన్స్ ఎక్కే సమయంలో ప్రయాణీకుల బ్యాగులు మరియు వస్తువులు తనిఖీ చేసినపుడు వారివద్ద పెప్పర్ స్ప్రే వంటివి ఉంటె వాటిని అనుమతించే వారు కాదు. కాగా ఇకపై మహిళల రక్షణార్థం పెప్పర్ స్ప్రే ను ఇకపై మెట్రో ట్రైన్స్ లో అనుమతిస్తాం అని, 

 

అలానే ఈ నిర్ణయాన్ని హైదరాబాద్ మెట్రో ట్రైన్స్ లో కూడా ప్రవేశపెట్టబోతున్నట్లు మెట్రో రైల్ అధికారులు నేడు తెలిపారు. వాస్తవానికి స్ప్రే ల వంటివి మెట్రో ట్రైన్స్ లో అనుమతించకపోవడానికి కారణం, అవి త్వరగా మంటలను వ్యాప్తి చేయడమే. అయితే ఆడవారి రక్షణే తమకు ముఖ్యం అని భావించి ఈ నిర్ణయాన్ని తీసుకున్నాం అని అధికారులు చెప్తున్నారు. కాగా మెట్రో అధికారులు తీసుకున్న ఈ సంచలన నిర్ణయంపై సర్వత్రా ప్రజలు మరియు ముఖ్యంగా మహిళల నుండి మంచి ప్రశంసలు అందుతున్నాయి......!!

మరింత సమాచారం తెలుసుకోండి: