ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇప్పుడు రాజ‌కీయాలు గ‌రం గ‌రంగా మారాయి.. హాట్ హాట్ కామెంట్ల‌తో.. హీట్ పెంచేస్తున్నారు రాజ‌కీయ నేత‌లు.. అస‌లే చ‌లికాలం.. చ‌లితో వ‌ణికిపోవాల్సిన ఏపీ.. ప్ర‌స్తుత రాజ‌కీయాల‌తో.. నేత‌ల పంచ్ డైలాగ్‌ల‌తో ఉక్క‌పోత పోస్తుంది. అస‌లు ఇప్పుడు ఓ నేత ఏకంగా క్రైస్త‌వ మ‌త ప్ర‌బోధ‌కుడు, ప్ర‌జాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ను మించిపోయాడు. పంచ్ డైలాగ్‌ల‌తో పంచేలూడ‌దీస్తానంటూ సిని ప‌క్కిలో రాజ‌కీయాల‌ను పండిస్తున్నారు. ఇంత‌కు పాల్ ను మించిపోయిన మొన‌గాడు ఎవ్వ‌రు అనుకుంటున్నారా..? ఎవ్వ‌రో కాదు.. నాకు తిక్కుంది.. కానీ దానికో లెక్కుంది అని పంచ్ డైలాగ్ ల‌తో సిని ప్ర‌పంచాన్ని ఉర్రూత‌లూగించిన ప్ర‌ముఖ హీరో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.

 

అవునా.. ప‌వ‌న్ రాజ‌కీయాల్లో కేఏ పాల్‌ను మించిపోయాడా.. నిజ‌మేనా.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌ట‌న ముందు కేఏ పాల్ ఎంత.. ప‌వ‌న్ ముందు ఎవ్వ‌రైనా దిగ‌దుడుపే అనుకుంటున్నారా.. లేదండి.. ఇంత‌కాలం  రాజ‌కీయాల్లో కేఏ పాల్ ను మించిన వారు ఎవ్వ‌రు లేరు.. కానీ పాల్ రాజ‌కీయాల నుంచి త‌ప్పుకోవ‌డంతో.. ఆ స్థానాన్ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ భ‌ర్తీ చేశార‌ట‌. ఇంత‌కు ముందు ఎన్నిక‌ల స‌మ‌యంలో కేఏ పాల్ చేసిన చిత్ర విచిత్ర విన్యాసాలు మ‌నం వీక్షించాం.. ఇప్పుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కేఏ పాల్‌ను మించిపోయే విన్యాసాలు చేస్తున్నారు.  ఇటీవ‌ల కాలంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేస్తున్న రాజ‌కీయ కామెంట్లు చూస్తుంటే న‌వ్వు పుట్టిస్తుంది.

 

అస‌లు రాజ‌కీయ నాయ‌కులు ఇలాగా కూడా మాట్లాడుతారా.. ఇదేమ‌న్నా సినిమానా..లేక రాజ‌కీయాలా అనుకుంత స్థాయికి రాజ‌కీయాల‌ను దిగ‌జార్చారు ప‌వ‌న్‌. రాజ‌కీయాలంటే సినిమాల్లో న‌టించినంత ఈజీ కాద‌న్న విష‌యం పాపం ప‌వ‌న్‌కు తెలియ‌ద‌నుకుంటా.. అందుకే పంచ్ డైలాగ్‌ల‌తో.. రాజ‌కీయ వ్యాఖ్యాల‌తో కేఏ పాల్‌ను మించిపోయారు. ఇటీవ‌ల కాలంలో ఎప్పుడు ఏదీ మాట్లాడుతున్నాడో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కే అంతు చిక్క‌ని విధంగా ఉంది. ఓసారి ప‌వ‌న్ మాట్లాడుతూ పంచెలూడ‌దీసి కొడ‌తానంటాడు.. ఏ రాజ‌కీయ నాయ‌కుడైనా ఇంత ప‌చ్చిగా మాట్లాడుతారా.. నాయ‌కుల‌నే ఇలా పంచేలూడ‌దీసి కొట్టే నాయ‌కుడిని ప్ర‌జ‌లు న‌మ్ముతారా.. ఇక తిరుప‌తి ప‌వ‌న్ క‌ళ్యాణ్ చాలా దిగ‌జారి మాట్లాడారు.

 

వైసీపీకి వ‌చ్చిన 151 ఎమ్మెల్యే సీట్లు.. నాకు ఎంత‌.. రెండు చిటికెలు వేసినంత‌.. అంటూ పంచ్ డైలాగ్ వేశారు. కేవ‌లం 6శాతం ఓట్లు సాధించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ 57 శాతం ఓట్లు తెచ్చుకున్న వైసీపీని ఇలా విమ‌ర్శించ‌డం చూస్తుంటే.. అది ఆయ‌న రాజ‌కీయ అజ్ఞానానికి నిద‌ర్శ‌నంగా నిలుస్తుంది. ఇక ఒక్క సీటు గెలిచిన ప‌వ‌న్ పార్టీ క‌న్న 151 సీట్లు సాధించిన వైసీపీ త‌క్కువ అని మాట్ల‌డ‌టం అంటే ఏపీలో మెజారిటీ ప్ర‌జ‌ల‌ను అవ‌మానించిన‌ట్లే అన్న విష‌యాన్ని మ‌ర్చిన‌ట్లున్నారు ప‌వ‌న్‌. ఏదేమైనా ప‌వ‌న్ చేస్తున్న కామెంట్లు, ఆయ‌న రాజ‌కీయ అజ్ఞానానికి అద్దం ప‌డుతుంది. మ‌రో కేఏ పాల్‌గా ప్ర‌జ‌లు అభివ‌ర్ణించే రోజులు వ‌స్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: