రాయలసీమ ప్రజలు వర్షాభావ పరిస్థితులతో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలను ఎదుర్కోవడానికి కనీసము పరిశ్రమలను నెలకొల్పి తే ప్రజల ఇక్కట్లు కొంతవరకు తొలగించవచ్చు. ఈ నేపథ్యంలోనే కడప జిల్లా వాసుల చిరకాల స్వప్నమైన కడప ఉక్కు కర్మాగారానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 23 లేదా 24వ తేదీన శంకుస్థాపన చేయడము జరుగుతుంది.. వైఎస్సార్‌ జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లి, పెద్దదండ్లూరు గ్రామాల పరిధిలో ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతిలో ఈ ఇంటిగ్రేటెడ్‌ స్టీల్‌ ప్లాంట్‌ను మొదలు పెట్టబోతున్నారు.. ఇందుకోసం ఏపీ హైగ్రేడ్‌ స్టీల్స్‌ లిమిటెడ్‌ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక కంపెనీని కూడాఏర్పాటు చేసింది. రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌ భార్గవ, మైనింగ్‌ శాఖ కార్యదర్శి కె.రాంగోపాల్‌లను ముఖ్య డైరెక్టర్లుగా నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేయడము జరిగినది. 

 

కడప జిల్లా వాసులకు ఈ పరిశ్రమలు స్థాపించడం వలన ఎంతోమందికి జీవనోపాధి ప్రయోజనాలు ఉన్నాయి. రాష్ట్ర విభజన సమయంలో కడపలో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తామని కేంద్రం హామీ ఇవ్వడం తెలిసిందే. అయితే ఐదేళ్లు గడిచినా అది ప్రభుత్వాలు మారినా అది ఇంతవరకూ కార్యరూపం దాల్చకపోవడం తెలిసిందే. 

 

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి భారీ పరిశ్రమలను తీసుకు రావడం ద్వారా స్థానిక యువతకు వీలైనంతవరకు ఉపాధి కల్పిస్తామని తమ మేనిఫెస్టోలో పేర్కొన్నడం జరిగినది.. ఇందులో భాగంగా కడప జిల్లాకు ఉక్కు కర్మాగారం నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం కడప జిల్లా వాసుల అదృష్టము. శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి స్టీల్ ప్లాంట్ ను స్థాపించాలి అనే దృఢచిత్తంతో ముందుకు సాగుతున్నారు. స్టీల్‌ప్లాంట్‌ కోసం బడ్జెట్‌లో రూ.250 కోట్లు కేటాయించడమేగాక దీనికి అవసరమైన ముడి ఇనుమును సరఫరా చేసే విధముగా ఎన్‌ఎండీసీతో ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు.

 

 ఈ నేపథ్యంలో కడప స్టీల్‌ ప్లాంట్‌ కోసం తక్షణం రూ.62 కోట్లు విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తాజాగా ఉత్తర్వులు జారీ చేయడము గమనార్హం.. ఈ యూనిట్‌ ఏర్పాటుకు సేకరించిన 3,295 ఎకరాలను చదును చేసి అభివృద్ధి చేయడం, డీపీఆర్‌ నివేదిక, ఏపీ హైగ్రేడ్‌ స్టీల్స్‌ లిమిటెడ్‌కు మూలధనం మరియు ఇతర ఖర్చుల కోసం.. ఈ మొత్తాన్ని ఖర్చు చేయబోతున్నారు.  ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర నివేదికను మొత్తముతయారుచేసే బాధ్యతను మెకాన్‌ అనేసంస్థకు అప్పగించినట్టు పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌ భార్గవ తాజాగా  తెలియచేయడం జరిగింది. ఈ నెలా ఖరుకు నివేదిక వస్తుందని  తెలియచేయడం జరిగింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: