టిడిపి గవర్నమెంట్ లో అకస్మాత్తుగా పైకి వచ్చిన పేరు ఎవరు అంటే కచ్చితంగా అందులో  సుజనా చౌదరి పేరు కూడా ఉంటుంది. టిడిపి ప్రభుత్వం లోనే పారిశ్రామికవేత్తగా బాగా ఎదిగిన పేరు సుజనా చౌదరి. ఈ పేరు వింటేనే చాలా మందికి ఈయనకు బాగా డబ్బు ఉంది అనే డౌట్ వస్తుంది. సుజనా చౌదరి చంద్రబాబు కి చాలా ఆత్మీయుడిగా ఉండేవారు. అలాగే ఆయన ఆర్థిక లావాదేవీలు కూడా చూసుకునే వారని గుసగుసలు వినిపించాయి. అది నిజమో కాదో ఎవరికీ తెలియదు.

 

 పారిశ్రామికవేత్తలు అన్న తరవాత బ్యాంకుల వద్ద కోట్లకు కోట్లు అప్పు తీసుకోవడం చాలా సహజం. అలాగే సుజనా చౌదరి కూడా తన వ్యాపారం కోసం చాలా బ్యాంకులలో అప్పు తీసుకున్నాడు. బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వకపోవడం తో మొండి బకాయిల లిస్టులో ఆయన పేరు చాలా ఎక్కువగా వినిపించేది. తాజాగా మరో సంచలన వార్త బయటకు వచ్చింది. సుజనా చౌదరి సతీమణి కూడా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని డబ్బులు తిరిగి కట్టలేదని తెలుస్తున్నాయి.

 

 సుజనా చౌదరి సతీమణి పద్మజ కు బ్యాంకులు నోటీసులు జారీ చేశాయి. విషయంలోకి వెళితే, చెన్నైలో ఉన్న ఐడిబిఐ బ్యాంక్ నుంచి ఈమె 169 కోట్ల రూపాయల రుణం తీసుకున్నారు. కానీ వాటిని తిరిగి చెల్లించకపోవడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో బ్యాంకు వీరికి నోటీసులు ఇచ్చింది.

 

ఈ నోటీసులు సుజనా సతీమణి పద్మజ కు, అలాగే సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ గొట్టుముక్కల శ్రీనివాస రాజు, ఎస్ టి ప్రసాద్, ఆయన సతీమణి ధనలక్ష్మి లకి, సుజనా కాపిటల్ సర్వీస్ లిమిటెడ్ సంస్థలకు ఈ నోటీసులు జారీ అయ్యాయి. ఇప్పటి వరకు ఆయన పేరు మాత్రమే మొండి బకాయిల లిస్టులో ఉండేది. కానీ, చివరికి తన సతీమణి పేరు కూడా ఇందులో రావడంతో అందరూ విస్మయానికి గురి  అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: