ప్రస్తుతం దేశంలో సామాన్యుడు బ్రతికే రోజులు కనుమరుగవుతున్నటు ప్రస్తుత పరిణామాలు బట్టి తెలుస్తోంది. విషయంలోకి వెళితే దేశవ్యాప్తంగా ఉల్లి రేటు రోజు రోజుకి పెరిగిపోతోంది. ఆకాశాన్ని అంటుతున్న ఉల్లి ధర చూసి రిటైల్ మార్కెట్లో ఉల్లిపాయలు కొనుక్కోవాలని మార్కెట్ కి వస్తున్న సామాన్య జనులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో కిలో ఉల్లి ధర 150 రూపాయలు పలుకుతోంది. ఒక్క రోజే దేశవ్యాప్తంగా మూడు వేల ధర ఉల్లిపాయ పలకటంతో రిటైల్ మార్కెట్లో షాక్ కొట్టే విధంగా సామాన్య జనులకు ఉల్లిపాయ ధర ఉండటంతో ...ప్రస్తుతం దేశంలో ఉల్లిపాయ చుట్టూ రాజకీయాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉల్లిపాయ రేటు గురించి పార్లమెంటులో సభ దద్దరిల్లింది.

 

పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరుగుతున్న తరుణంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ లోక్సభలో ఉల్లిపాయలు గురించి మరియు రేటు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. సభలో నిర్మల సీతారామన్ మాట్లాడుతూ...తాను ఉల్లిపాయలు ఎక్కువగా తిననని నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రకటించి ఎంపీలను ఆశ్చర్యంలో ముంచెత్తారు. ‘‘నేను ఉల్లిపాయ-వెల్లుల్లిని ఎక్కువగా తినను. ఉల్లిపాయతో పెద్దగా సంబంధం లేని కుటుంబం నుంచి నేను వచ్చాను’’ అని నిర్మలా సీతారామన్ మాట్లాడటంతో ఆమె ప్రసంగం చేస్తున్న సమయంలో విపక్ష సభ్యులు అడ్డుపడ్డారు. దీంతో పార్లమెంటులో గందరగోళం నెలకొంది.

 

అయితే ఆ తర్వాత మంత్రి నిర్మల సీతారామన్ మాట్లాడుతూ ...దేశంలో నెలకొని ఉన్న ఉల్లిపాయ సంక్షోభాన్ని త్వరలో అధిగమిస్తామని ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విదేశాల నుంచి ఉల్లిని దిగుమతి చేసుకుంటామని అంతేకాకుండా త్వరలోనే ఉల్లిపాయల ధర తగ్గించి సామాన్యులకు అందే విధంగా ఎగుమతి చేస్తామని నిర్మల సీతారామన్ హామీ ఇచ్చారు. మరోపక్క హైదరాబాద్ మరియు కోల్‌కతా వంటి నగరాల్లో ఉల్లిపాయ ధర సుమారు కిలో 150 రూపాయలు పలుకుతుంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కిలో ఇరవై ఐదు రూపాయలకే ఉల్లిపాయలు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. దీంతో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్దగా ఉల్లిపాయలు గురించి సామాన్య జనులు ఇబ్బందులు ఏమి పడక పోవటం విశేషం. 

మరింత సమాచారం తెలుసుకోండి: