గుంటూరు జిల్లా తుళ్లూరులో రాజధాని రైతులు, కూలీలు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. చంద్రబాబు ప్రభుత్వ కుంభకోణమే అసలు కోణం అనే పేరుతో రైతుల, కూలీల రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతోంది. రైతులు, కూలీలు చంద్రబాబు రాజధాని పేరుతో అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడని విమర్శించారు. రౌండ్ టేబుల్ సమావేశానికి రైతులు, కూలీలు భారీగా తరలివస్తున్నారు. 
 
రైతులు మాట్లాడుతూ ఫ్లాట్ల కేటాయింపులోను తమకు అన్యాయం జరిగిందని చెబుతున్నారు. తమ ఫ్లాట్ లు ఎక్కడున్నాయో చంద్రబాబు చెప్పాలని రైతులు డిమాండ్ చేశారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ తో భూములు కొనుగోలు చేశారని రైతులు చెప్పారు. ఇది అంతర్జాతీయ రాజధాని కాదు.. అంతర్జాతీయ కుంభకోణం అని రైతులు చెప్పారు. చంద్రబాబు, ఆయన బినామీలు రాజధానిని ప్రకటించక ముందే భూములు కొనుగోలు చేశారని చెప్పారు. 
 
ఈ సమావేశంలో రాజధాని ప్రాంత రైతులు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల నేతలు పాల్గొన్నారు. రైతులు గత ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన అన్యాయంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫ్లాట్ల విషయంలో తమకు తీరని అన్యాయం జరిగిందని రైతులు చెబుతున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం దళితులకు తీవ్రంగా అన్యాయం చేసిందని దళితులు విమర్శిస్తున్నారు. 
 
మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఎమ్మెల్యేలు, సీపీఐ నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఒక రైతు మాట్లాడుతూ రాజధాని ప్రకటనకు ముందు మనరాష్ట్రంలో కొంతమంది నిరుపేద రైతులు భూములు కొనుగోలు చేశారని మొదటి నిరుపేద రైతు చంద్రబాబు అని 15 ఎకరాలు చంద్రబాబు కొనుగోలు చేశారని చెప్పారు. ఒకవైపు తెలుగుదేశం పార్టీ ఏ ప్లస్ కన్వెన్షన్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తుండగా రైతు వర్గం అఖిల పక్షం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తోంది. కొన్ని రోజుల క్రితం రాజధాని ప్రాంతంలో చంద్రబాబు కాన్వాయ్ పై రైతులు చెప్పులు, కర్రలతో దాడి చేశారు. అందువలన చంద్రబాబు విజయవాడలో సమావేశం నిర్వహిస్తున్నారు. 

 
 

మరింత సమాచారం తెలుసుకోండి: