విశాఖ పట్నం సాగరము ఎంతో అందంగా ఉంటుంది. ఆర్‌కే బీచ్‌ వేదికగా ప్రభుత్వము ఏర్పాటు చేసిన  తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో నేవీ డే వేడుకలు తాజాగా ఎంతో గొప్పగా నిర్వహించడం జరిగింది. విశిష్ట, ముఖ్య అతిథిగా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారు నేవీ డే వేడుకలకు హాజరు అవ్వడం జరిగింది. ఆయనకు తూర్పు నౌకాదళాధిపతి, వైస్‌ అడ్మిరల్‌ అతుల్‌ కుమార్‌ జైన్‌ సతీసమేతంగా ఘనస్వాగతం పలకడం జరిగింది. మొదట నేవీ చిల్డ్రన్‌ స్కూల్‌ విద్యార్థుల నేవీ బ్యాండ్‌ ప్రదర్శనతో నావికాదళ వేడుకలు నిర్వహించారు. 

 

మెరైన్‌ కమెండోలు 84 ఎంఎం రాకెట్‌ వాటర్‌ బాంబు పేల్చి సీఎం జగన్ మోహన్ రెడ్డికి  సుస్వాగతం పలకడం జరిగింది. మొట్ట మొదటిసారిగా త్రివిధ దళాలకు చెందినటు వంటి సిబ్బంది ఈ విన్యాసాల్లో పాల్కొనడం జరిగింది. ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సూర్యకిరణ్‌ యుద్ధ విమానాల బృందం చేసిన విన్యాసాలు అందరికీ ఒళ్ళు గగుర్పొడిచేలా చేశాయి.  దాదాపు గంటకు 70 కిలోమీటర్ల వేగంతో సముద్రంలో పయనిస్తూ ఐఎస్‌వీ తరహా నౌకలు సుదూరం నుంచి ఎదురెదురుగా దూసుకువచ్చే సన్నివేశం అందరిని అబ్బురపరచేల చేసింది.

 

Image result for navy day celebration in vizag

 

ఆరువేల అడుగుల ఎత్తులో పయనిస్తున్న ఎయిర్‌ క్రాఫ్ట్‌ల నుంచి పారా జంపింగ్‌ చేసిన స్కై డైవర్లు గాల్లో విన్యాసాలు చేస్తూ ప్యారాచూట్ల సహాయంతో వేదిక ప్రాంగణంలో చాకచక్యంగా వాలారు. ఇలా చూస్తూ ఉండడం చాలా వింతగా అనిపించింది. అనంతరం స్కై డైవర్ల బృంద సారధి లెఫ్టినెంట్‌ రాథోడ్‌ విశిష్ట ముఖ్య  అతిథి అయినా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి గారికి స్మృతి చిహ్నాన్ని కూడా అందించడం జరిగింది. 

 

  రెస్క్యూ ఆపరేషన్‌లో భాగంగా సముద్రంలో చిక్కుకున్నట్టు వారిని కూడా హెలికాప్టర్ల ద్వారా రక్షించడం, మిగ్‌ విమానాలు పల్టీలు కొడుతూ దూసుకుపోవడం, చాలా సాహసకృత్యం అయినటువంటి విన్యాసము. మార్కోస్‌ను సీకింగ్‌ హెలికాప్టర్ల ద్వారా మరో చోటకు తరలించడం వంటి సాహస విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఎంతో అద్భుతమైన రీతిలో సాహస విన్యాసాలు ప్రదర్శించారంటూ నౌకాదళ బృందాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రసంగించడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: