ఉద్యోగాల కల్పనలో జగన్మోహన్ రెడ్డి దెబ్బకు ప్రముఖ కార్ల ఉత్పత్తి సంస్ధ కియా మోటార్స్ దిగొచ్చింది. ఉద్యోగాల కల్పనలో పరిశ్రమలు స్ధానికులకే 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అసెంబ్లీలో బిల్లు కూడా పెట్టి పాస్ చేసింది. సరే ప్రభుత్వ నిర్ణయంపై షరా మామూలుగానే చంద్రబాబునాయుడు అండ్ కో తీవ్రంగా వ్యతిరేకించారనుకోండి అది వేరే సంగతి.

 

జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తాజాగా కియా మోటార్స్ యాజమాన్యం స్పందించింది. రాష్ట్రప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా తమ కంపెనీలో స్ధానికులకే 75 శాతం ఉద్యోగాలను కేటాయించనున్నట్లు ప్రకటించింది. నైపుణ్యాలు అవసరం లేని ఉద్యోగాల్లో నూరుశాతం స్ధానికులకే అవకాశాలు ఇవ్వాలని కూడా నిర్ణయించిచటం గమనార్హం.

 

స్ధానికుల కోటాలో ముందు అనంతపురం జిల్లా జనాలకే తొలి ప్రాధాన్యమిస్తున్నట్లు యాజమాన్యం స్పష్టంగా ప్రకటించింది. తమ కార్ల తయారీ పరిశ్రమల్లో 4 వేల శాశ్వత ఉద్యోగాలు, 7 వేల మందికి తాత్కాలిక ఉద్యోగాలను కల్పించనున్నట్లు యాజమాన్యం చెప్పింది. ఈ జిల్లాలోనే తొందరలో ఏర్పాటు కాబోతున్న వీర బస్సుల తయారీ యూనిట్ వల్ల కూడా స్ధానికులకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించనున్నట్లు కియా మోటార్స్ చెప్పింది.

 

స్ధానికులకే 75 శాతం ఉద్యోగాలని జగన్ చెప్పినపుడు చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకించారు. అంతర్జాతీయ స్ధాయి పరిశ్రమల్లో కూడా స్ధానికులకు 75 శాతం ఉద్యోగాలని నిర్ణయం తీసుకుంటే ఏ పరిశ్రమ కూడా ముందుకు రాదంటా నానా యాగీ చేశారు. సరే చంద్రబాబు అన్నారు కాబట్టి అదే విషయాన్ని పట్టుకుని మిగిలిన టిడిపి నేతలు కూడా ఒకటే గోల చేశారు.

 

విచిత్రమేమిటంటే జగన్ నిర్ణయానికి సానుకూలంగా తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్రలోని పార్టీలు స్పందించాయి. ఇపుడు స్వయంగా కియా మోటార్స్ యాజమాన్యమే జగన్ నిర్ణయం కరెక్టని చెప్పింది కదా. ఇక్కడే జగన్ అంటే చంద్రబాబులో ఉన్న ధ్వేషం బయటపడుతోంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: