కొద్ది రోజుల క్రితం జరిగిన దిశ’ హత్యాచారం నేపథ్యంలో సర్వత్రా మహిళల భద్రతపై భయాందోళనలు నెలకొన్నాయి. ఈ క్రమంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత చర్యలు తీసుకుంటున్నా పరిస్దితి ఇంకా అదుపులోకి రాకుండా జరిగే ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు మహిళల్లో తమకున్న భద్రత విషయంలో పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

 

 

భయంతో వణికిపోతున్నారు. ఇదే కాకుండా నగర శివారులో జనసామర్థ్యం తక్కువగా ఉండే చోట్ల, రాత్రివేళల్లో రవాణా సౌకర్యం తక్కువగా ఉండే ప్రాంతాల్లో ఆందోళనకర పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇదిలా ఉండగా పోలీసులు మాత్రం ఎలాంటి భయాందోళలకు గురికావొద్దంటూ సూచిస్తున్నారు. ఎక్కడ, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా 100కు ఫోన్‌ చేస్తే చాలు వెంటనే స్పందిస్తామని చెబుతున్నారు.

 

 

అంతే కాకుండా ఇప్పటికే గస్తీని ముమ్మురం చేశామని చెబుతున్నారు.. ఈ నేపధ్యంలో వరంగల్‌ పరిధిలో నివాసముంటున్న ఓ మహిళా అధ్యాపకురాలు తనకు ఆయుధ లైసెన్స్‌ కావాలంటూ వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ను అభ్యర్థించింది. ఇకపోతే ఈ విషయం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమవుతోంది.

 

 

ఇలాంటి దారుణమైన అరాచకాలు సమాజంలో జరుగుతుంటే ప్రతివారు తమ చేతికి ఆయుధం కావాలని అభ్యర్తిస్తే పరిస్దితి ఏంటని ఇప్పుడు పోలీసు అధికారులు ఆలోచనలో పడ్డారట. ఇకపోతే రాష్ట్రంలో గాని ఇతర జిల్లాల్లో గాని కొందరు మహిళల కు మినహా ఎవరికీ ఆయుధ లైసెన్సులు లేవని పోలీసులు చెబుతున్నారు. ఇకపోతే ఇప్పటివరకు తెలిసిన ప్రకారం సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్ల పరిధుల్లో 13 వేల మందికి ఆయుధ అనుమతులున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇలాంటి వారిలో వివిధ వర్గాలకు, రంగాలకు చెందిన వారు ఉన్నారని పేర్కొన్నారు.. 

 

 

ఇదే కాకుండా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్‌ కమిషరేట్లులో సుమారు 500 మంది ఉండొచ్చని పోలీస్‌ అధికారులు తెలిపారు. ఇకపోతే ఇంతకాలం చీపుర్లు, వంటగదిలో గరిటెలు పట్టిన చేతులతో ఇప్పుడు మహిళలు ఆయుధాలు ధరించాలని చూస్తుంటే మన దేశం ఎంత ఎదిగిందో అర్ధం అవుతుందంటున్నారు కొందరు సామాజిక వేత్తలు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: